త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kim Jong Un | కిమ్ కొత్త టెన్ష‌న్‌.. ఒకేసారి 10 క్షిప‌ణుల ప్ర‌యోగం

ఓ వైపు ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా (North Korea) కొత్త టెన్ష‌న్ కు తెర లేపింది. శ‌నివారం స‌ముద్ర‌జ‌లాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిప‌ణుల‌ (Missiles)ను ప్ర‌యోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా  మిలిటరీతో పాటు జ‌పాన్ వెల్లడించింది.

S

International | Published On Mar 14, 2026, 3.50 pm IST

Kim Jong Un | కిమ్ కొత్త టెన్ష‌న్‌.. ఒకేసారి 10 క్షిప‌ణుల ప్ర‌యోగం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఓ వైపు ప‌శ్చిమాసియా యుద్ధం నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా (North Korea) కొత్త టెన్ష‌న్ కు తెర లేపింది. శ‌నివారం స‌ముద్ర‌జ‌లాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిప‌ణుల‌ (Missiles)ను ప్ర‌యోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా  మిలిటరీతో పాటు జ‌పాన్ వెల్లడించింది. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపం నుంచి క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అవి ఎంత దూరం ప్రయాణించాయో తమకు తెలియదని పేర్కొంది.

ఉత్త‌ర కొరియా ప్రయోగించిన ఆయుధాలు తమ దేశ ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడినట్లు జ‌పాన్  ర‌క్ష‌ణ శాఖ‌ తెలిపింది. కాగా తమ దేశంపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించడానికే ఈ శక్తిమంతమైన క్షిపణులతో ప్రయోగాలు చేస్తున్నట్లు కిమ్‌ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా-దక్షిణ కొరియా (US-South Korea) వార్షిక సైనిక విన్యాసాల (Military exercises) వేళ ఉత్తరకొరియా కవ్వింపులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ ప్రయోగాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

వారం క్రితం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఓ యుద్ధనౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఆ ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ (Kim Jong Un), తన 13 ఏళ్ల కుమార్తె కిమ్‌ జు యేతో కలిసి కాన్ఫరెన్స్‌ హాలు నుంచి వీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. తమ దేశంపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించడానికే ఈ శక్తిమంతమైన క్షిపణులతో ప్రయోగాలు చేస్తున్నట్లు కిమ్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ క్షిపణి ప్రయోగం తర్వాత జపాన్ తమ పౌరులను అప్రమత్తం చేసింది. జపాన్ ప్రధాని మంత్రి కార్యాలయం ఎక్స్‌లో ఒక అధికారిక పోస్ట్‌ను ప్రచురించింది. అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగంపై మరింత సమాచారం అందిస్తామ‌ని ఆ పోస్ట్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement