Fighter Jets | గాల్లో ఢీకొన్న రెండు యుద్ధవిమానాలు.. వీడియో
Fighter Jets | ఎయిర్ షోలో (Air Show) భాగంగా రెండు యుద్ధ విమానాలు (Fighter Jets) విన్యాసాలు చేస్తున్నాయి. కింది నుంచి చూస్తున్న ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇంతలోనే ఆ రెండు విమానాలు అనుకోకుండా ఒకదానికొకటి ఢీకొన్నాయి (Collided).
International | Published On May 18, 2026, 6.18 am IST
Fighter Jets | త్రినేత్ర.న్యూస్: ఎయిర్ షోలో (Air Show) భాగంగా రెండు యుద్ధ విమానాలు (Fighter Jets) విన్యాసాలు చేస్తున్నాయి. కింది నుంచి చూస్తున్న ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇంతలోనే ఆ రెండు విమానాలు అనుకోకుండా ఒకదానికొకటి ఢీకొన్నాయి (Collided). చూస్తుండగానే పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్మేసింది. మరి భారీ ప్రమాదం నుంచి ఆ రెండు విమానాల్లో ఉన్న పైలట్ల సంగతి ఏంటి? బతికే ఉన్నారా? క్షేమంగా బయటపడ్డారా?.. నలుగురు పైలట్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని ఐడహో (Idaho) రాష్ట్రంలోని గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలు అవుతుంది. ఐడహూ రాష్ట్రంలోని మౌంటెయిన్ హోమ్ ఎయిర్ బేస్‌లో ఎయిర్ షో జరుగుతున్నది. యుద్ద విమానాల విన్యాసాలు ఆహుతూలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన రెండు ఈఏ 18జీ గ్రోవ్లర్ ఫైటర్ జెట్లు గాల్లో అంతెత్తుకు ఎగిరి విన్యాసాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పైలట్లు వాటిపై పట్టు కోల్పోవడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. చూస్తుండగానే మంటలు అంటుకోవడం, పేలిపోవడం జరిగిపోయాయి. అప్రమత్తమైన నలుగురు పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విమానాలు ఢీకొన్న వెంటనే పారాచూట్ సాయంతో ఎజెక్ట్ అయ్యారు. ఎయిర్ బేస్ నుంచి రెండు మైళ్ల దూరంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మౌంటెన్‌హౌస్ ఎయిర్ బేస్‌లో ఎయిర్ షో జరగడం గత ఎనిమిదేండ్లలో ఇదే మొదటిసారి. దీంతో వేలాది మంది ఈ షోకు తరలివచ్చారు.
WATCH: Two US Navy F/A-18 fighter jets collided mid-air while performing at an air show in Idaho. pic.twitter.com/X0SwDlsCtf
— The Current Sphere (@current_sphere) May 17, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?






