త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Piyush Goyal | ప‌ర్యావ‌ర‌ణ నాశ‌నానికి మీరే కార‌ణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్ర‌మంత్రి విమ‌ర్శ‌లు

Piyush Goyal | భూగోళంపై ప‌ర్యావ‌ర‌ణ నాశ‌నానికి (global carbon emissions) ఐరోపా దేశాలు, అమెరికాయే కార‌ణ‌మ‌ని కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ (Piyush Goyal) విమ‌ర్శించారు. ఐరోపా దేశాల ఎన్విరాన్‌మెంటల్ ఫుట్‌ప్రింట్‌తో పోలిస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందని చెప్పారు.

D

National | Published On Oct 23, 2026, 3.20 pm IST

Piyush Goyal | ప‌ర్యావ‌ర‌ణ నాశ‌నానికి మీరే కార‌ణం.. అమెరికా, ఐరోపా దేశాలపై కేంద్ర‌మంత్రి విమ‌ర్శ‌లు
Advertisement

Piyush Goyal | త్రినేత్ర న్యూస్ : భూగోళంపై ప‌ర్యావ‌ర‌ణ నాశ‌నానికి (global carbon emissions) ఐరోపా దేశాలు, అమెరికాయే కార‌ణ‌మ‌ని కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్ (Piyush Goyal) విమ‌ర్శించారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేసి, ఇప్పుడు దానికి మూల్యాన్ని ఇత‌ర దేశాల‌ను చెల్లించ‌మ‌న‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నించారు. బెర్లిన్ గ్లోబ‌ల్ డైలాగ్‌లో పీయూష్ గోయ‌ల్ మాట్లాడుతూ మొత్తం గంద‌ర‌గోళానికి బాధ్యులెవ‌ర‌ని నిల‌దీశారు.

ఓజోన్ పొర ఎక్క‌డ దెబ్బ‌తిన్న‌ద‌ని, వాతావ‌ర‌ణంలోకి ఇంత కార్బ‌న్‌ను ఎవ‌రు విడుద‌ల చేశార‌ని కేంద్ర మంత్రి ప్ర‌శ్నించారు. ప్ర‌పంచ జ‌నాభాలో త‌మ దేశం వాటా 17 శాత‌మ‌ని, ప్ర‌పంచ కార్బ‌న్ ఉద్గారాల్లో వాటా కేవ‌లం మూడు శాతం కంటే త‌క్కువేన‌ని స్ప‌ష్టం చేశారు. ఐరోపా దేశాల ఎన్విరాన్‌మెంటల్ ఫుట్‌ప్రింట్‌తో పోలిస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. ప్ర‌పంచ జ‌నాభాలో ఐరోపా దేశాల వాటా కేవ‌లం మూడు నుంచి నాలుగు శాత‌మ‌ని గుర్తు చేశారు. కానీ కార్బన ఉద్గారాల్లో మాత్రం ఐరోపా దేశాల వాటా చాలా ఎక్కువ‌ని వివ‌రించారు. ఇప్ప‌టికీ ఐరోపా దేశాల త‌ల‌స‌రి కార్బ‌న ఉద్గారాల‌లో భార‌త దేశ వాటా కేవ‌లం ప‌ది శాతం ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చ‌ద‌వండి.. భానుడి భ‌గ‌భ‌గ‌లు.. 50 వేల మంది మృత్యువాత‌.. వాతావరణ మార్పులే కారణమంటున్న ప‌రిశోధ‌కులు

ఐరోపా దేశాల త‌ల‌స‌రి కార్బ‌న ఉద్గారాలు, ప‌ర్యావ‌ర‌ణంపై చూపే త‌ల‌స‌రి ప్ర‌భావం భార‌త‌దేశంతో పోలిస్తే ఏడెనిమిదిరెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, స‌ర్క్యుల‌ర్ ఎకానమీ వంటి విష‌యాల‌లో భార‌త‌దేశం ఎంతో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. భారత్ చేపడుతున్న విస్తృతమైన స్వచ్ఛ ఇంధన కార్యక్రమాలను కేంద్ర మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దేశంలోని 140 కోట్ల ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చాల్సిన బాధ్య‌త కూడా త‌మ ప్ర‌భుత్వంపై ఉంద‌ని చెప్పారు. వారి ఇంధ‌న అవ‌స‌రాలు, ఆహార అవ‌స‌రాల‌ను తీర్చ‌డంతో పాటు దేశ భ‌ద్ర‌త‌ను కూడా కాపాడుకోవ‌డం ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని ఉద్ఘాటించారు.

Also Read..

అయ్య‌ప్ప భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక పంపా వ‌ర‌కూ బ‌స్సు

సైన్యం చేతికి నాగాస్త్ర-2.. శ‌త్రువుల‌కు వ‌ణుకే

విభజన శక్తులకు వ్య‌తిరేకంగా ఐక్యంగా పోరాడాలి.. ప్రధాని మోదీ పిలుపు

Advertisement
Advertisement