Imran Khan | నా భార్య పట్ల జైలు అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్
Imran Khan | తన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) పట్ల జైలు అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
International | Published On Mar 24, 2026, 4.13 pm IST
Imran Khan | తన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) పట్ల జైలు అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు తన భార్యను సాధనంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
"ఈ దేశంలోని న్యాయమూర్తులు తమను తాము చూసి సిగ్గుపడాలి. మేము పదేపదే న్యాయవ్యవస్థను ఆశ్రయించాము. కానీ వారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారు. మాకు అన్యాయం చేస్తున్నారు. నన్ను ఏమీ లేయలేమని వారికి తెలుసు. అందుకే వారు నా భార్య బుష్రా బీబీని లక్ష్యంగా చేసుకున్నారు. నన్ను బ్లాక్ మెయిల్ చేయడం కోసం బుష్రా బీబీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు (Inhumane Treatment)" అని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తన భార్యను జైల్లో ఒంటరిని చేశారని, తనతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని ఆరోపించారు. వారంలో కేవలం 30 నిమిషాలు మాత్రమే తనతో మాట్లాడేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాలను ఇమ్రాన్ ఈద్ సందర్భంగా తన కుమారుడు కాసిం ఖాన్‌తో ఫోన్ సంభాషణలో ప్రస్తావించినట్లు ది ఇండిపెండెంట్ నివేదించింది.
కాగా, ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అతను కుడివైపు కంటి చూపును దాదాపు 85 శాతం కోల్పోయారు. అందుకు ఆయనకు ఇటీవలే చికిత్స కూడా అందించారు. సునిల్ గావస్కర్, కపిల్ దేవ్ సహా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆదేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ సైతం తోషాఖానా కేసులో జైలుకెళ్లారు. ఈ కేసులో ఆమెకు 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. వీరిద్దరూ ప్రస్తుతం అడియాలా జైల్లో (Adiala Jail) శిక్ష అనుభవిస్తున్నారు.
Also Read..
ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలు.. డిస్కౌంట్‌తో పాటు లోన్ సౌకర్యం: పొన్నం
తాజావార్తలు
- ●Sara Arjun | రామ్‌చరణ్‌కు జోడీగా ధురంధర్ హీరోయిన్? - ఆర్సీ 17పై కొత్త రూమర్
- ●Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
- ●Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!
- ●CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
- ●India GDP Growth | భారత ఆర్థిక వృద్ధికి బ్రేకులు.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతమే..
- ●Telangana Martyrs | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం..!

Sara Arjun | రామ్‌చరణ్‌కు జోడీగా ధురంధర్ హీరోయిన్? - ఆర్సీ 17పై కొత్త రూమర్

Minister Komatireddy | 22ఏ జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Maharashtra Freedom of Religion Act 2026 | మహారాష్ట్రలో ఆగస్టు 28 నుంచి 'మత మార్పిడి నిరోధక చట్టం' అమలు.. గెజిట్ విడుదల, శిక్షల వివరాలు ఇవే!

CM Revanth Reddy | 20న లండన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి






