హెచ్1బీ వీసాల విషయంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై విషం కక్కిన విషయం తెలిసిందే. హెచ్1బీ వీసా ఇంటర్వ్యూల కోసం ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలన్నీ మార్చి 2026 కు వాయిదా వేశారు. దానికి కారణం.. యూఎస్ తీసుకొచ్చిన సోషల్ మీడియా కొత్త నిబంధనలే. ఇప్పటి వరకు హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేసేవారు కాదు. కానీ.. ఇక నుంచి యూఎస్ వెళ్లడం కోసం హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వాళ్లకు వీసా మంజూరు చేయనున్నారు. వాటిని తనిఖీ చేయడానికి చాలా సమయం పడుతుండటంతో డిసెంబర్ 15 నుంచి షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలు అన్నీ మార్చి 2026 కు యూఎస్ ఎంబసీ అధికారులు వాయిదా వేశారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ అటార్నీలు కూడా స్పందించారు. హెచ్1బీ వీసాదారులు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు వెళ్లొద్దని సూచిస్తున్నారు. చివరి నిమిషాల్లో భారత్‌లో యూఎస్ వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేశారు. అవి మార్చి లేదా ఏప్రిల్ 2026 లో జరుగుతాయని ఎంబసీ అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈసమయంలో భారత్‌కు వస్తే తిరిగి యూఎస్ వెళ్లడానికి హెచ్1బీ వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవడం లేట్ అవుతుంది. దాని వల్ల యూఎస్ కంపెనీలు ఎక్కువ రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దాని వల్ల యూఎస్‌లో ఉద్యోగాలు పోయే ప్రమాదంలో ఉద్యోగులు పడతారని ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెబుతున్నారు. చివరి నిమిషంలో మెయిల్స్ చాలామంది హెచ్1బీ వీసాదారులు వాళ్లకు షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి భారత్‌కు వస్తున్నారు. కానీ చివరి నిమిషంలో వాళ్ల ఇంటర్వ్యూలు క్యాన్సిల్ అయినట్లు ఎంబసీ అధికారులు మెయిల్స్ చేయడంతో వీసా దరఖాస్తుదారులలో ఆందోళన మొదలైంది. వాలిడ్ వీసా ఉంటేనే రండి వీసా స్టాంపింగ్ కోసం ఈ సమయంలో మాత్రం అస్సలు భారత్ రావద్దని, పాస్‌పోర్ట్‌లో వాలిడ్ వీసా ఉంటేనే భారత్‌కు రావాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.