త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | మాపై దాడిచేస్తే ప‌శ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖ‌మేనీ హెచ్చ‌రిక‌లు

Iran | అగ్ర‌రాజ్యం అమెరికా (America), ఇరాన్ (Iran) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌రూపందాల్చాయి. ఇరు దేశాధినేత‌లు తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసుకుంటున్నారు.

D

International | Published On Feb 2, 2026, 10.54 am IST

Iran | మాపై దాడిచేస్తే ప‌శ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధమే.. ట్రంప్‌కు ఖ‌మేనీ హెచ్చ‌రిక‌లు
Advertisement

Iran | అగ్ర‌రాజ్యం అమెరికా (America), ఇరాన్ (Iran) మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌రూపందాల్చాయి. ఇరు దేశాధినేత‌లు తీవ్ర హెచ్చ‌రిక‌లు చేసుకుంటున్నారు. ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను విరమించుకునేలా ఒప్పందం చేసుకునేందుకు చర్చలకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌పై ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ (ayatollah ali khamenei) తాజాగా స్పందించారు. అమెరికా త‌మ‌పై దాడికి పాల్ప‌డితే అది ప‌శ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంద‌ని హెచ్చ‌రించారు. తాము యుద్ధం కోరుకోవ‌డం లేద‌ని.. త‌మ‌పై దాడి చేస్తే మాత్రం గ‌ట్టిగా స‌మాధానం ఇస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు

ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను విరమించుకునేలా ఒప్పందం చేసుకునేందుకు చర్చలకు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు 'యుఎస్ఎస్ అబ్రహం లింకన్' (USS Abraham Lincoln) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నేతృత్వంలోని "భారీ నౌకాదళం (Massive Armada)" ఇరాన్ వైపు కదులుతోందని త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో ప్ర‌క‌టించారు. వెనిజులాకు పంపిన దానికంటే ఇది చాలా పెద్ద నౌకాదళమని, ఇది శక్తి, ఉత్సాహం, లక్ష్యంతో వేగంగా కదులుతోందని పేర్కొన్నారు. ఈ సైన్యం తన మిషన్‌ను వేగంగా.. అవసరమైతే విధ్వంసకరంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు.

ఇరాన్ త్వరగా "చర్చల టేబుల్ (Table)" వద్దకు వచ్చి, అందరికీ ఆమోదయోగ్యమైన, న్యాయమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. "అణ్వాయుధాలు వద్దు (NO NUCLEAR WEAPONS)" అనేదే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. సమయం మించిపోతోందని, పరిస్థితి చాలా కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement