త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hormuz Crisis | హార్ముజ్ సంక్షోభంతో నాటో కూట‌మిలో చీలిక‌..! మిత్ర‌దేశాల‌కు ట్రంప్ వార్నింగ్‌..!

Hormuz Crisis | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌-యూఎస్ దాడుల‌కు వ్య‌తిరేకంగా ఇరాన్ కీల‌క‌మైన హార్ముజ్ జ‌ల‌సంధిని మాసివేసింది. దాంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయిల్ స‌ర‌ఫ‌రాపై తీవ్ర‌ప్ర‌భావం ప‌డింది.

P

International | Published On Mar 16, 2026, 4.10 pm IST

Hormuz Crisis | హార్ముజ్ సంక్షోభంతో నాటో కూట‌మిలో చీలిక‌..! మిత్ర‌దేశాల‌కు ట్రంప్ వార్నింగ్‌..!
Advertisement

Hormuz Crisis | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌-యూఎస్ దాడుల‌కు వ్య‌తిరేకంగా ఇరాన్ కీల‌క‌మైన హార్ముజ్ జ‌ల‌సంధిని మాసివేసింది. దాంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆయిల్ స‌ర‌ఫ‌రాపై తీవ్ర‌ప్ర‌భావం ప‌డింది. ఇప్ప‌ట్లో సంక్షోభం ముగిసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క్ర‌మంలో గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఓవైపు ఇరాన్ పశ్చిమ ఆసియాలోని అమెరికా ఎయిర్‌బేస్‌లు, ఇజ్రాయెల్‌పై దాడులు కొన‌సాగిస్తోంది. మ‌రోవైపు అమెరికా దేశీయ రాజకీయాల్లో కూడా ట్రంప్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. చాలామంది అమెరిక‌న్స్ యుద్ధాన్ని వ్య‌తిరేకిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాటో మిత్రదేశాల మద్దతు ట్రంప్‌కు లభించకపోవడం గమనార్హం. దీంతో నాటో భవిష్యత్తుపై ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ నాటో దేశాలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. హార్ముజ్ జ‌ల‌జంధి ద్వారా లాభాలు పొందుతున్న దేశాలు దాని భ‌ద్ర‌త‌కు బాధ్య‌త వ‌హించాల‌న్నారు. లాభ‌ప‌డుతున్న దేశాలు అక్క‌డ ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ఉంద‌ని, ఎవ‌రూ స‌హాయం చేక‌పోతే నాటో భ‌విష్య‌త్‌కు అది ఏమాత్రం మంచిద‌ని తాను భావిస్తున్నానంటూ ట్రంప్ హెచ్చ‌రించారు. అలాగే, ఉక్రెయిన్ విష‌యంలో మాకు వారి సహాయం అవసరం లేద‌ని, ఇప్పుడు సహాయం చేస్తారా లేదా? చూడాల‌న్నారు.

చాలాకాలంగా తాము వారికి అండ‌గా నిలుస్తున్నామ‌ని చెబుతున్నామ‌ని, కానీ వారంతా త‌మ‌కు తోడుగా నిలువ‌డం లేద‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పశ్చిమ ఆసియా సంక్షోభంతో అమెరికా తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రనేతలు మరణించినప్పటికీ.. ఇరాన్ వెనక్కి త‌గ్గ‌డం లేదు. రోజు రోజుకు ప‌శ్చిమాసియాలో ఉన్న యూఎస్ ఎయిర్‌బేస్‌ల‌తో పాటు ఇజ్రాయెల్‌పై దాడులు కొన‌సాగిస్తూనే ఉన్న‌ది. ఇరాన్‌లో పాలన మార్పు తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా చమురు కంపెనీలు కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. త్వరగా పరిష్కారం కనుగొనకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ట్రంప్‌ను హెచ్చరించాయి. హార్ముజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల‌కు ర‌క్ష‌ణ‌గా యుద్ధ నౌక‌ల‌ను పంపాల‌ని ఏడు దేశాల‌ను కోరారు. అయితే, అమెరికాకు అత్యంత స‌న్నిహిత మిత్ర‌దేశాలైన ఆస్ట్రేలియా, జ‌పాన్ త‌దిత‌ర దేశాలు ఇందుకు నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు భావిస్తున్నారు.

Advertisement
Advertisement