Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో తగ్గిన హిందువుల ప్రాతినిధ్యం.. 79 మంది పోటీ చేస్తే గెలిచింది నలుగురే..!
Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల మధ్య 13వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని పార్టీ 299 స్థానాల్లో పోటీ చేస్తే 211 సీట్లలో గెలిచింది. రెండు దశాబ్దాల తర్వాత బీఎన్‌పీకి ఇదే భారీ విజయంగా భావిస్తున్నారు.
International | Published On Feb 14, 2026, 12.30 pm IST
Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల మధ్య 13వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని పార్టీ 299 స్థానాల్లో పోటీ చేస్తే 211 సీట్లలో గెలిచింది. రెండు దశాబ్దాల తర్వాత బీఎన్‌పీకి ఇదే భారీ విజయంగా భావిస్తున్నారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో బంగ్లాదేశ్‌లోని మైనారిటీల ప్రాతినిధ్యం అంతంతమాత్రంగానే ఉంది. మొత్తం ఎన్నికల్లో కేవలం నలుగురు మాత్రమే మైనారిటీలు గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా మొత్తం జనాభాలో ఎనిమిది శాతం ఉంది. గత 20 ఏళ్లలో మైనారిటీ ప్రాతినిథ్యం సాధారణంగా 14-20 సీట్లు గెలిచేవారు. కానీ, ఈ సారి మాత్రం నలుగురు మాత్రమే గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైనారిటీల ప్రాతినిధ్యం ఏంటనే చర్చ సాగుతోంది.
ఈ సారి ఎన్నికల్లో 79 మైనారిటీ అభ్యర్థులు పోటీచేశారు. ఇందులో నలుగురు గెలిచారు. ముగ్గురు హిందువులు, ఓ గిరిజనుడు గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ నలుగురు బీఎన్‌పీ నుంచి గెలువడం విశేషం. జమాతే-ఇ-ఇస్లామీ నుంచి పోటీ చేసిన ఓ హిందూ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఈ ఫలితాలు మైనారిటీల రాజకీయ భవిష్యత్, భాగస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అలాగే, బంగ్లాలో మారుతున్న రాజకీయాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మైనారిటీ సమాజం భద్రత, ప్రాతినిధ్యం ఇప్పటికీ ఒక సవాల్‌గా మిగులుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎన్నికల్లో గయేశ్వర్ చంద్రమోహన్ రాయ్ (BNP) నుంచి ఢాకా-3 పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. సమీప ప్రత్యర్థిని సుమారు 99వేల ఓట్ల తేడాతో గెలిచారు. నితాయ్ రాయ్ చౌధురి మాగురా-2 స్థానం నుంచి గెలిచారు. ఆయనకు 1,47,896 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి జమాత్-ఇ-ఇస్లామీ అభ్యర్థి ముస్తర్షిద్ బిల్లాకు 117,018 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపెన్ ద్యువాన్ రంగమాటి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు మొత్తం 31,222 ఓట్లు రాగా.. సమీప స్వతంత్ర అభ్యర్థి పాహెల్ చక్మాకు 21,544 ఓట్లు మాత్రమే వచ్చాయి. సచిన్ పృ బందర్బన్ నియోజకవర్గం విజయం సాధించారు. ఆయనకు 1,41,455 ఓట్లు వచ్చాయి. జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ నుంచి పోటీ చేసిన హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఖుల్నా-1 నియోజకవర్గం నుంచి ఓటమిపాలయ్యారు. బీఎన్‌పీ అభ్యర్థి చేతిలో 70వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికలో జమాత్ తరఫున ఏ మైనారిటీ అభ్యర్థి విజయం సాధించలేకపోయారు.
ఈ సారి మొత్తం 79 మంది మైనారిటీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో పది మంది మహిళలు సైతం ఉన్నారు. 60 రాజకీయ పార్టీల్లో.. 22 తమతమ పార్టీల తరఫున హిందువులను బరిలోకి దింపాయి. బీఎన్‌పీ ఆరుగురు అభ్యర్థులను పోటీ చేయించింది. ఇందులో నలుగురు విజయం సాధించారు. బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీ అత్యధికంగా మైనారిటీ అభ్యర్థులను పోటీ చేయించింది. స్వతంత్రంగానూ మైనారిటీ అభ్యర్థులూ ఎన్నికల్లో పోటీ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నా.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్‌కు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. బంగ్లాదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా.. మహ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వ స్థానంలో బీఎన్‌పీ ప్రభుత్వం కొలువదీరనున్నది. ప్రధానిగా తారిక్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






