త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh | కాళ్లు, చేతులు క‌ట్టేసి.. ఎన్నిక‌ల వేళ బంగ్లాలో మ‌రో హిందూ యువ‌కుడి దారుణ హ‌త్య‌

Bangladesh | బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందులే ల‌క్ష్యంగా దాడులు కొన‌సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం సుసేన్ చంద్ర‌శేఖ‌ర్ అనే హిందూ వ్యాపారి హ‌త్యోదంతం మ‌ర‌చిపోక‌ముందే మ‌రో హిందూ యువ‌కుడు (Hindu man) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

G

International | Published On Feb 12, 2026, 10.14 am IST

Bangladesh | కాళ్లు, చేతులు క‌ట్టేసి.. ఎన్నిక‌ల వేళ బంగ్లాలో మ‌రో హిందూ యువ‌కుడి దారుణ హ‌త్య‌
Advertisement

Bangladesh | త్రినేత్ర‌.న్యూస్‌: బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందులే ల‌క్ష్యంగా దాడులు కొన‌సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం సుసేన్ చంద్ర‌శేఖ‌ర్ అనే హిందూ వ్యాపారి హ‌త్యోదంతం మ‌ర‌చిపోక‌ముందే మ‌రో హిందూ యువ‌కుడు (Hindu man) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. మౌల్వీబ‌జార్ జిల్లాలో ర‌త‌న్ ష‌వో క‌ర్ (Ratan Shuvo Kar) అనే 28 ఏండ్ల యువ‌కుడిని కాళ్లు, చేతులు క‌ట్టేసి చంపేశారు. అత‌డు చంపా ప్రాంతంలోని టీ తోట‌లో కార్మికుడిగా ప‌నిచేస్తున్నాడ‌ని అధికారులు వెల్ల‌డించారు. టీ తోట‌లోనే అత‌ని మృత‌దేహాన్ని గుర్తించిన‌ట్లు తెలిపారు. ఒళ్లంతా గాయాల‌య్యాయ‌ని, మృత‌దేహం ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న‌ద‌ని చెప్పారు. సావ్ర‌త్రిక ఎన్నిక‌ల వేళ ఈ హ‌త్య జ‌ర‌గ‌డం గమ‌నార్హం.

మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ర‌త‌న్ కోసం వెతుకుతున్నామ‌ని అత‌ని సోద‌రుడు ల‌క్ష‌ణ్ క‌ర్ తెలిపారు. అత‌ని మృత‌దేహం టీ తోట‌లో ఉంద‌ని స‌మాచారం అంద‌డంతో అక్క‌డికి వెళ్లామ‌న్నారు. ర‌త‌న్‌ను చంపడానికి గ‌ల కార‌ణాలు త‌మ‌కు తెలియ‌ద‌ని చెప్పారు.

కాగా, సోమ‌వారం రాత్రి సుసేన్ చంద్రశేఖ‌ర్ (62) అనే హిందూ వ్యాపారికి దుండ‌గులు క‌త్తితో పొడిచి చంపారు. త‌న బియ్యం దుకాణంలో ఉండ‌గా లోప‌లికి చొర‌బ‌డిన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌పై క‌త్తితో దాడి చేశార‌ని, దీంతో అక్క‌డిక‌క్క‌డే ఆయ‌న మ‌ర‌ణించార‌ని పోలీసులు తెలిపారు. వ్యాపారి చ‌నిపోయాడానికి నిర్ధారించుకున్న త‌ర్వాత ఎవ‌రికీ అనుమానం రాకుండా దాకాణం ష‌ట్ట‌ర్‌ను మూసివేసి నిందితులు అక్క‌డినుంచి ప‌రార‌య్యారు. అనంత‌రం షాప్‌కి వ‌చ్చిన మృతుని కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

Advertisement
Advertisement