Melinda Gates | మానసిక క్షోభను అనుభవించా.. అందుకే బిల్‌గేట్స్‌కు విడాకులిచ్చా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై మెలిండా గేట్స్
Melinda Gates | బిల్‌గేట్స్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉండటంతోనే వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) తెలిపారు.
International | Published On Feb 4, 2026, 1.58 pm IST
Melinda Gates | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సెక్స్ కుంభకోణం కేసుకు సంబంధించిన దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు బయటపడ్డాయి. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత బిల్‌గేట్స్ (Bill Gates)కు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ ఆరోపించినట్లు ఫైల్స్ ద్వారా బయటపడింది. ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) తాజాగా స్పందించారు. బిల్‌గేట్స్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉండటంతోనే వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు తెలిపారు. ఆ విషయం తెలిసి తాను ఎంతో మానసిక క్షోభను అనుభవించినట్లు మెలిండా చెప్పుకొచ్చారు.
"బిల్ గేట్స్‌కు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. ఎంతో బాధను అనుభవించాను. అప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. ఈ కారణంతోనే ఆయనతో నా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ గురించి బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పాలి. నేను కాదు. ఈ కేసులో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" అని మెలిండా చెప్పుకొచ్చారు. ఓ పాడ్ కాస్ట్‌తో మాట్లాడుతూ.. మెలిండా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోని టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ఇదీ..
తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2002-2005 మధ్య కాలంలో మైనర్ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన మాన్‌హట్టన్ భవనం, పామ్ బీచ్ ఎస్టేట్, ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్‌పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అతన్ని 2019 జులైలో జైలులో వేశారు. ఇక అదే ఏడాది ఆగస్టు 10న మాన్‌హట్టన్ జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతో ఎప్‌స్టీన్‌కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఫైల్స్ లిస్ట్‌లో పలువురి రాజకీయ నేతలు, జర్నలిస్ట్‌లు, వ్యాపారవేత్తలు, బిజినెస్ అండ్ టెక్ టైకూన్స్, సినిమా వాళ్ల పేర్లు ఉండటం చర్చకు దారితీస్తోంది.
గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్..
ఇక ఈ ఫైల్స్ (Epstein files)కు సంబంధించిన 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. అందులో బిల్‌గేట్స్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత బిల్‌గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్ రాసుకున్న ఈమెయిల్ ద్వారా బయటపడింది. రష్యా యువతులతో గేట్స్ సెక్స్ చేసినట్లు ఎప్‌స్టీన్ తన మెయిల్‌లో రాసుకున్నాడు. దీంతో గేట్స్ సెక్సువల్ డిసీజ్ బారిన పడినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు తన భార్య మెలిండాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని బిల్‌గేట్స్ ప్రయత్నించినట్లు కూడా ఎప్‌స్టీన్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది.
విడాకులు..
1994లో బిల్‌గేట్స్, మెలిండా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వివిధ కారణాల వల్ల దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విబేధాలు వచ్చాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు అదే నిజమైంది. మెలిండాతో విడాకుల అనంతరం టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ (Mark Hurd) మాజీ భార్య 62 ఏళ్ల పౌలా హర్డ్ (Paula Hurd)తో బిల్‌గేట్స్ డేటింగ్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Melania Trump | అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
ఏప్రిల్ 10, 2026

Epstein Files | మనుషుల జ్ఞాపకాలను ఎప్‌స్టీన్ చెరిపివేశాడా..? MIT ప్రముఖుడితో సంభాషణ..
ఫిబ్రవరి 20, 2026

Andrew | ఎప్‌స్టీన్ ఫైల్స్ కేసులో కీలక పరిణామం.. కింగ్ చార్లెస్ సోదరుడు ఆండ్రూ అరెస్ట్
ఫిబ్రవరి 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



