Gautam Adani | గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసు కొట్టివేత..
Gautam Adani | భారత బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై నమోదైన కేసును అమెరికా న్యాయమూర్తి కొట్టివేశారు. అదానీపై మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన కేసును ఉపసంహరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
International | Published On Aug 11, 2026, 10.47 am IST
Gautam Adani | భారత బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై నమోదైన కేసును అమెరికా న్యాయమూర్తి కొట్టివేశారు. అదానీపై మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన కేసును ఉపసంహరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అదానీపై నమోదైన ఆరోపణలను కొట్టివేయాలని అమెరికా ప్రాసిక్యూటర్లు 2024 మే నెలలో దాఖలు చేసిన అభ్యర్థనకు బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి నికోలస్ గరాఫ్యూస్ అధికారికంగా ఆమోదం తెలిపారు. సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత అధికారులకు అదానీ 265 మిలియన్ డాలర్ల మేర లంచాలను ఇచ్చారన్నది అమెరికా ప్రభుత్వం అప్పట్లో చేసిన ఆరోపణ.
10 బిలియన్ డాలర్ల పెట్టుబడులే..?
అదానీ తరఫు న్యాయవాది రాబర్ట్ గియుఫ్రా అమెరికా న్యాయశాఖ అధికారులతో ఏప్రిల్‌లో చర్చలు జరిపినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. కేసును ఉపసంహరించుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పినట్లు సమాచారం. గియుఫ్రా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా కూడా ఉన్నారు. కేసును కొట్టివేయడంలో ఈ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి హామీ ప్రభావం చూపిందా అని న్యాయమూర్తి గతంలో ప్రశ్నించారు. అమెరికా ఫెడరల్ న్యాయ వ్యవస్థలో ఇలాంటి కేసు ఉపసంహరణ అరుదైన పరిణామం కావడంతో ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే, చివరికి కేసును ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఈ పెట్టుబడి హామీ భాగం కాదని న్యాయమూర్తి తేల్చారు.
న్యాయమూర్తి అసంతృప్తి..
అయితే కేసును ఉపసంహరించుకునే విషయంలో ట్రంప్ నియమించిన డిప్యూటీ అసోసియేట్ అటార్నీ జనరల్ ట్రెంట్ మెక్‌కాటర్ వ్యవహరించిన తీరుపై న్యాయమూర్తి గరాఫ్యూస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదానీ తరఫు న్యాయవాదులతో కలిసి మెక్‌కాటర్ ఈ నిర్ణయం తీసుకోవడం, ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ అధికారులు లేదా కేసును ముందుకు తీసుకెళ్లిన ప్రాసిక్యూటర్ల అభిప్రాయాలను తీసుకోకపోవడం అత్యంత అసాధారణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. అదానీ గ్రూప్ భారత్‌లోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి. పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్ పరిశ్రమలు, మీడియా సంస్థలు సహా అనేక రంగాల్లో ఈ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో కార్పొరేట్ మోసం ఆరోపణలు, షేర్ మార్కెట్‌లో భారీ పతనం కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
స్పందించిన అదానీ..
అదానీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా, సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌కు బహిరంగ మద్దతుదారుగా ఉన్నారు. అదానీ కూడా మోదీ స్వస్థలమైన గుజరాత్‌కు చెందినవారే. అమెరికా కోర్టు నిర్ణయంపై అదానీ స్పందిస్తూ.. న్యాయ ప్రక్రియపై పూర్తి గౌరవం, వినయంతో ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సవాళ్లతో కూడిన ఈ కాలంలో తమకు సత్యం, న్యాయం, చట్టబద్ధ పాలనపై ఉన్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | ముడి చమురు దెబ్బ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Colombia | కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి
- ●Murder | ఇద్దరు కుమార్తెలను చంపి.. గొంతు కోసుకున్న తండ్రి..!
- ●Rajasthan | పొలంలో దాచిన రూ. 5 లక్షలు చెదలపాలు.. ఓ రైతు నిర్లక్ష్యం ఇదీ..!
- ● ‘హోదా’ ఇచ్చేది లేదాయె..నిధులు వచ్చేది లేదాయె: ఢిల్లీ 'పక్షపాత' డ్రామాలో తెలంగాణ బలి!
- ●Chukkala Amavasya 2026 | రేపే చుక్కల అమావాస్య.. ఈ పూజ చేస్తే అమ్మాయిలకు వివాహం ఖాయం..!

Stock Markets | ముడి చమురు దెబ్బ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Colombia | కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి

Murder | ఇద్దరు కుమార్తెలను చంపి.. గొంతు కోసుకున్న తండ్రి..!

Rajasthan | పొలంలో దాచిన రూ. 5 లక్షలు చెదలపాలు.. ఓ రైతు నిర్లక్ష్యం ఇదీ..!






