Gates Foundation | ఎప్‌స్టీన్‌తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ జరపలేదు : గేట్స్ ఫౌండేషన్
Gates Foundation | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein)తో సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై దాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) తాజాగా స్పందించింది. అతడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలేలూ జరపలేదని వెల్లడించింది.
International | Published On Feb 12, 2026, 3.20 pm IST
Gates Foundation | అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) సెక్స్ కుంభకోణం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవలే అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. ఎప్‌స్టీన్‌కు, దాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్ (Gates Foundation) సిబ్బందికి మధ్య సంభాషణ జరిగినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గేట్స్ ఫౌండేషన్ తాజాగా స్పందించింది. అతడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలేలూ జరపలేదని వెల్లడించింది.
ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలను సమకూరుస్తామని అప్పట్లో ఎప్‌స్టీన్ చెప్పినట్లు తెలిపింది. అందుకే అతడితో తమ సిబ్బంది కొందరు సంభాషణలు జరిపినట్లు పేర్కొంది. కానీ, అతడు చెప్పిన ప్రకారం తమ ఫౌండేషన్ కోసం ఎలాంటి నిధి ఏర్పాటు చేయలేదని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ 2000 సంవత్సరంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి బిల్‌గేట్స్ చైర్మన్‌గా ఉన్నారు.
కాగా, జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయ విభాగం ఇటీవలే 30 లక్షల ఫైల్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో 1.8 లక్షల ఫోటోలు, 2,000 కు పైగా వీడియోలు ఉన్నాయి. ఈ ఫైల్స్ ద్వారా పదేళ్ల క్రితం జరిగిన నేరాలు, తెరవెనుక సాగిన చీకటి ఒప్పందాలు బయటపడుతున్నాయి. జెఫ్రీ సన్నిహితుల లిస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బిలియనీర్ ఎలాన్ మస్క్ సహా పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా వాళ్ల పేర్లు ఉన్నాయి. ఈ ఫైల్స్ ద్వారా బిల్ గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు కూడా బయటపడిన విషయం తెలిసిందే. రష్యా యువతులతో గడపడంతో ఆయన సుఖవ్యాధుల బారిన పడినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ ఆరోపణలను గేట్స్ బృందం ఖండించింది. ఇక ఈ సెక్స్ కుంభకోణం కారణంగానే బిల్ గేట్స్‌తో తన వైవాహిక జీవితానికి ముగింపు పలికినట్లు మెలిందా గేట్స్ చెప్పడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






