త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran-Israel War | ఇరాన్ స్ట్రైక్స్‌కి ‘టెల్ అవివ్’ ఆగమాగం.. సౌదీ అరేబియా వార్నింగ్

హార్మోజ్ జలసంధి మూసివేతతో చమురు నౌకలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఒక బ్యారెల్ ధర ప్రస్తుతం 120 డాలర్లకు చేరుకుంది.

J

International | Published On Mar 9, 2026, 8.10 pm IST

Iran-Israel War | ఇరాన్ స్ట్రైక్స్‌కి ‘టెల్ అవివ్’ ఆగమాగం.. సౌదీ అరేబియా వార్నింగ్
Advertisement
  • అరబ్ దేశాల మీద ప్రతాపం చూపిస్తే నష్టపోయేది మీరే
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కి హెజ్బుల్లా స్వాగతం

Iran-Israel War | త్రినేత్ర.న్యూస్ : ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్, యూఎస్- ఇజ్రాయెల్ యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని అరబ్ దేశాలు మాత్రం భారీగా నష్టపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచే ఇరాన్.. ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ నగరంపై విరుచుకుపడింది. టెల్ అవివ్‌లో పది దాడుల వరకు జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ మిసైల్ దాడులతో టెల్ అవివ్ ఆగమాగమైంది. అరబ్ దేశాలపై విరుచుకుపడుతున్న ఇరాన్‌కి సౌదీ అరేబియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అరబ్ దేశాల మీద ఇంకా దాడులు కొనసాగిస్తే టెహ్రాన్ ఎక్కువ నష్టపోతుందని హెచ్చరించింది. సౌదీలోని షాయెబా ఆయిల్ ఫీల్డ్ మీద డ్రోన్ దాడి జరగడంతో సౌదీ పై వ్యాఖ్యలు చేసింది.

ఇరాన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలను ఖండించిన సుప్రీం

గల్ఫ్ దేశాలపై ఇక దాడులు చేయబోమని ఇరాన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ సుప్రీం ఖండించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ చిన్న కొడుకు మొజ్తాబా ఖమేనీని ఎంపిక చేశారు. దీంతో లెబనాన్‌కి చెందిన హెజ్బుల్లా సంస్థ కొత్త సుప్రీం లీడర్‌ని స్వాగతించింది.

వణుకుతున్న దోహా, బహ్రెయిన్

మరోవైపు దోహా, బహ్రెయిన్‌లో దాడులు కొనసాగుతున్నాయి. భారీ శబ్దాలతో కూడిన పేలుడు ధాటికి అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టర్కీ ఎయిర్‌స్పేస్‌లోకి చొరబడిన ఇరాన్ రెండో క్షిపణిని నాటో అడ్డగించింది. దాన్ని ఆకాశంలోనే పేల్చేసింది.

భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్

హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు నౌకలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఒక బ్యారెల్ ధర ప్రస్తుతం 120 డాలర్లకు చేరుకుంది.

Advertisement
Advertisement