త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | నేను ఎంత‌కాలం ఉంటానో తెలియ‌దు.. భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై ట్రంప్ ఆందోళ‌న‌

Donald Trump | త‌న భ‌ద్ర‌త‌పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాను ఎంత‌కాలం బ‌తుకుతానో త‌న‌కే తెలియ‌డం (Dont Know How Long Ill Be) లేదంటూ ఆందోళ‌న వ్య‌క్తం Trump Raises Security Alarm) చేశారు.

D

International | Published On Feb 24, 2026, 12.19 pm IST

Donald Trump | నేను ఎంత‌కాలం ఉంటానో తెలియ‌దు.. భ‌ద్ర‌తా వైఫ‌ల్యంపై ట్రంప్ ఆందోళ‌న‌
Advertisement

Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యక్తిగత రిసార్ట్ అయిన 'మార్-ఎ-లాగో' (Mar-a-Lago) వద్ద శనివారం అర్ధరాత్రి భ‌ద్ర‌తా వైఫ‌ల్యం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆయుధంతో రిసార్ట్ రక్షణ వలయాన్ని ఛేదించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌పై అధ్య‌క్షుడు ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేర‌కు త‌న భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. తాను ఎంత‌కాలం బ‌తుకుతానో త‌న‌కే తెలియ‌డం (Dont Know How Long Ill Be) లేదంటూ ఆందోళ‌న వ్య‌క్తం Trump Raises Security Alarm) చేశారు.

వైట్‌హౌస్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ట్రంప్ పాల్గొని ప్ర‌సంగించారు. ‘‘న‌న్ను హ‌త్య చేసేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎలా తిరుగుతున్నారో చూశారు కాదా? ఇదంతా చూస్తుంటే.. నేను ఇంకా ఎంతకాలం బ‌తుకుతానో నాకే తెలియ‌ట్లేదు. మీకు తెలుసా.. సాధార‌ణంగా ఇలాంటి షూట‌ర్లు అధ్య‌క్షుల జోలికి వెళ్ల‌రు. కేవ‌లం అసాధార‌ణ విజ‌యాలు సాధించే అధ్యక్షుల‌నే ల‌క్ష్యంగా చేసుకుంటారు. అబ్రహం లింకన్, కెన్నడీ వంటి వారినే లక్ష్యంగా చేసుకుంటారు. బహుశా నేను కొంచెం తక్కువ ప్రభావశీల నాయకుడిగా ఉండి ఉంటే బాగుండేదేమో. అయినా స‌రే ఇలాంటి బెదిరింపుల‌కు నేను భ‌య‌ప‌డ‌ను. నేను తీసుకునే నిర్ణ‌యాల‌పై ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌బోను’’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అధ్య‌క్షుడి వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

అసలేం జరిగింది..?

స్థానిక కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉత్తర కరోలినాకు చెందిన సుమారు 20 ఏళ్ల యువకుడు తన కారులో మార్-ఎ-లాగో ఉత్తర ద్వారం (North Gate) వద్దకు చేరుకున్నాడు. మరో వాహనం బయటకు వెళ్తున్న సమయంలో, దాన్ని అనుసరిస్తూ వేగంగా లోపలికి చొరబడ్డాడు. వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ అతడిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆ యువకుడి వద్ద ఒక షాట్‌గన్, ఇంధనం (Fuel) ఉన్న క్యాన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని ఆయుధాన్ని కింద పడేయమని ఏజెంట్లు హెచ్చరించారు. అయితే ఆ యువకుడు తన వద్ద ఉన్న గ్యాస్ క్యాన్‌ను కింద పడేసి, షాట్‌గన్‌ను భద్రతా దళాల వైపు ఎక్కుపెట్టాడు. దీంతో ముప్పును పసిగట్టిన ఏజెంట్లు వెంటనే కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అక్క‌డ లేరు. వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో ఉన్నారు.

Advertisement
Advertisement