త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trump Tariffs | 10 కాదు 15 శాతం.. సుంకాలపై మాట మార్చిన అమెరికా అధ్య‌క్షుడు

G

International | Published On Feb 22, 2026, 6.50 am IST

Trump Tariffs | 10 కాదు 15 శాతం.. సుంకాలపై మాట మార్చిన అమెరికా అధ్య‌క్షుడు
Advertisement

Trump Tariffs | త్రినేత్ర‌.న్యూస్‌: సుంకాల విష‌యంలో సుప్రీంకోర్టు షాకిచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) అంటున్నారు. సుప్రీం తీర్పు త‌ర్వాత‌ ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకాలు (Trump Tariffs) విధించిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ వాటిని 15 శాతానికి (Global Tariffs) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు త‌న సోష‌ల్ మీడియా ‘ట్రూత్‌’ ద్వారా వెళ్ల‌డించారు. సవరించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని స్ప‌ష్టం చేశారు. భార‌త్‌కూ 15 శాత‌మే వ‌ర్తిస్తాయని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు అనంత‌రం త‌న‌కున్న అధికారాల‌తో అన్ని దేశాల‌పై 10 శాతం సుకాలు విధిస్తూ ఉత్త‌ర్వుల‌పై సంత‌కాలు చేశారు. అవి ఈ నెల 24 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు. అయితే వాటిని రోజు తిరుగ‌క‌ముందే 10 నుంచి 15 శాతానికి పెంచారు. సుంకాల‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన హాస్యాస్పదమైన, పేలవమైన, అసాధారణ అమెరికా వ్యతిరేక తీర్పు తర్వాత అన్ని అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అనంత‌రం ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ చెప్పారు.

చ‌ట్టానికి నిలిచే విధంగానే టారీఫ్‌ల‌ను 10 నుంచి 15 శాతానికి పెంచుతామ‌న్నారు. ప్ర‌తీకార సుంకాలు లేకుండా కొన్ని దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న ఆయా దేశాలు ఇందులో ఉన్నాయ‌న్నారు. తాను అధికారంలోకి వచ్చేదాకా ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగిందని మండిపడ్డారు. చ‌ట్టానికి నిలిచేలా 15 శాతం స్థాయికి సుంకాల‌ను తీసుకెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

అమెరికా ట్రేడ్‌ చట్టం–1974లోని సెక్షన్‌ 122 ప్రకారం ఇతర దేశాల ఉత్పత్తులపై 15 శాతం దాకా టారిఫ్‌లను 150 రోజుల పాటు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. దీనికి అమెరికా కాంగ్రెస్‌ అనుమతి తీసుకోవాల్సిన‌ అవసరం లేదు. అయితే ఇది న్యాయ సమీక్షకు అతీతమేమీ కాదు. దీనిపై కూడా ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు.

Advertisement
Advertisement