త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | టెహ్రాన్‌పై అమెరికా భీక‌ర‌ దాడులు.. ఇరాన్ సైనిక ఉన్న‌తాధికారులు మృతి: ట్రంప్

Donald Trump | ఇచ్చిన‌ గ‌డువు ముగియ‌క ముందే ఇరాన్‌పై (Iran) అమెరికా భారీ దాడుల‌తో విరుచుకుప‌డింది. రాజ‌ధాని టెహ్రాన్‌పై బాంబుల వ‌ర్షం కురిపించింది. దీంతో ఆ దేశానికి చెందిన ప‌లువురు సైనిక ఉన్న‌తాధికారులు మృతిచెందారు.

G

International | Published On Apr 5, 2026, 8.37 am IST

Donald Trump | టెహ్రాన్‌పై అమెరికా భీక‌ర‌ దాడులు.. ఇరాన్ సైనిక ఉన్న‌తాధికారులు మృతి: ట్రంప్
Advertisement

Donald Trump | త్రినేత్ర‌.న్యూస్‌: ఇచ్చిన‌ గ‌డువు ముగియ‌క ముందే ఇరాన్‌పై (Iran) అమెరికా భారీ దాడుల‌తో విరుచుకుప‌డింది. రాజ‌ధాని టెహ్రాన్‌పై బాంబుల వ‌ర్షం కురిపించింది. దీంతో ఆ దేశానికి చెందిన ప‌లువురు సైనిక ఉన్న‌తాధికారులు మృతిచెందారు. ఈ మేర‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్వ‌యంగా వెల్ల‌డించారు.

‘ఇరాన్‌పై విజ‌యం సాధించాం. టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ సైన్యాన్ని త‌ప్పుదారి ప‌ట్టించిన సైనిక నాయకుల్లో అనేక మంది అమెరికా భారీ దాడిలో ప్రాణాలు (Terminated) కోల్పోయారు’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు. వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దాడి ఎలా జరిగింది? లక్ష్యాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అందులో చీకటి వాతావరణంలో విమానాల శబ్దాలు, భారీ పేలుళ్ల ధ్వనులు వినిపిస్తున్నాయి.

హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవాలని లేదా తమతో ఒప్పందానికి రావాలని ఇచ్చిన 10 రోజుల గడువు ముగుస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. మరో 48 గంటల్లో దారిలోకి రాకపోతే `నరకం చూపిస్తాం` అని తీవ్ర స్థాయిలో హెచ్చరించిన విష‌యం తెలిసిందే. ఈ హెచ్చరికల అనంతరమే దాడులు జరిగినట్లు తెలుస్తున్న‌ది. కాగా, దీనిపై ఇరాన్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువ‌డ‌లేదు.

ఏప్రిల్ 6 వ‌ర‌కు డెడ్ లైన్

వాస్తవానికి ఈ గడువు ముందే ముగియాల్సి ఉండగా, ఇరాన్ అభ్యర్థన మేరకు ట్రంప్ దీనిని పొడిగించారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులను ఆపాలని టెహ్రాన్ కోరినట్లు ట్రంప్ మార్చి 26న వెల్లడించారు. "నా మనుషుల ద్వారా వారు చాలా మర్యాదగా అడిగారు. 'మాకు కాస్త సమయం ఇస్తారా?' అని అడిగారు. వారు 7 రోజులు అడిగారు, కానీ నేను వారికి 10 రోజులు ఇస్తున్నాను" అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో గడువు ఏప్రిల్ 6కు పొడిగించారు. ఆ లోపు వారు చెప్పినట్లు చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లను నాశనం చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement