Hungary Elections | హంగేరి పార్లమెంట్ ఎన్నికలు.. ట్రంప్ మిత్రుడి దారుణ ఓటమి..
Hungary Elections | ఐరోపా దేశం హంగేరిలో పార్లమెంటరీ ఎన్నికల్లో (Hungary Elections) ప్రధాని విక్టర్ ఓరాన్ (Viktor Orbán)దారుణంగా ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతుదారుడైన ఓరాన్ 16 ఏండ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారు.
International | Published On Apr 13, 2026, 7.11 am IST
Hungary Elections | త్రినేత్ర.న్యూస్: ఐరోపా దేశం హంగేరిలో పార్లమెంటరీ ఎన్నికల్లో (Hungary Elections) ప్రధాని విక్టర్ ఓరాన్ (Viktor Orbán)దారుణంగా ఓడిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతుదారుడైన ఓరాన్ 16 ఏండ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ఇప్పటివరకు 99 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవగా, 45 ఏండ్ల పీటర్ మాగ్యార్ (Peter Magyar) నేతృత్వంలోని టీస్జా పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 138 స్థానాలను దక్కించుకున్న విపక్ష టీస్టా పార్టీ (Tisza party) భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నది.

Peter Magyar
ఈ నేపథ్యంలో ప్రధాని విక్టర్ ఓరన్ తన ఓటమిని అంగీకరించారు. రాజధాని బుడాపెస్ట్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విజయం సాధించిన పార్టీకి అభినందనలు తెలిపారు. `ఇకపై మనం ప్రతిపక్షంగా కూడా హంగేరియన్ జాతికి, మన మాతృభూమికి సేవ చేయబోతున్నాం` అని ప్రకటించారు.
విక్టర్ ఓరాన్ హంగేరి 56వ ప్రధానిగా 2010 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. 2010లో జరిగిన ఎన్నికల తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2014, 2018, 2022 ఎన్నికల్లోనూ ప్రధానిగా ఎన్నికయ్యారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ కీలక మిత్రుడిగా పేరొందారు. ఉక్రెయిన్, రష్యా సంబంధాల విషయంలో యూరోపియన్ యూనియన్‌తో ఆయన తరచూ విభేదించేవారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






