Trump Dinner Shooting Chaos | ఎవరి గోల వారిది: కాల్పుల భయంలోనూ మద్యం సీసాలపైనే కన్ను
వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల మోత మోగుతుంటే.. కొందరు జర్నలిస్టులు వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకపక్క భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా, ప్రాణభయంతో కొందరు పరుగులు తీస్తుంటే, మరికొందరు మీడియా ప్రతినిధులు మాత్రం అక్కడున్న ఖరీదైన వైన్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇంకొందరైతే ఏమీ జరగనట్లు నవ్వుతూ సెల్ఫీలు దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
International | Published On Apr 26, 2026, 5.46 pm IST
Trump Dinner Shooting Chaos | త్రినేత్ర.న్యూస్ : రోడ్డు మీద కోడిగుడ్ల లారీ లేదా మద్యం లారీ బోల్తా పడితే జనాలు ఎగబడి తీసుకెళ్లడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ, ప్రపంచానికే పెద్దన్న అనిపించుకునే అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. అదీ ఏ గల్లీలోనో కాదు.. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరైన ప్రతిష్టాత్మక 'వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్' కార్యక్రమంలో ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
ప్రాణభయంతో కొందరు.. సెల్ఫీలు, మద్యంతో మరికొందరు
వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ డిన్నర్ పార్టీలో ఒక్కసారిగా కాల్పుల మోత మోగింది. ట్రంప్‌తో సహా ప్రముఖులందరినీ భద్రతా సిబ్బంది హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాల్‌రూమ్‌లో ఉన్న దాదాపు 2,500 మంది అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఇంకొందరు బయటకు పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది ప్రాంగణాన్ని జల్లెడ పడుతున్నారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
వైరల్‌గా మారిన దృశ్యాలు
అక్కడ పార్టీ కోసం ఏర్పాటు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను వదిలి వెళ్లడానికి కొందరికి మనసు రాలేదు. దీంతో చేతికి దొరికిన వైన్ బాటిళ్లను చంకనబెట్టుకుని తాపీగా అక్కడి నుంచి జారుకున్నారు. కొందరు ఏకంగా గ్లాసుల్లో మిగిలి ఉన్న మద్యాన్ని గబగబా తాగేసి వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక నల్లటి డ్రెస్ వేసుకున్న మహిళ అయితే ఏకంగా రెండు మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లడం కెమెరాలకు చిక్కింది.
అంతేకాదు, అక్కడ ఏమీ జరగనట్లుగా ఇంకొందరు ఉల్లాసంగా నవ్వుతూ సెల్ఫీలు దిగుతూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ పక్క భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకునే పనిలో ఉంటే, బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొందరు జర్నలిస్టులు ఇలా వ్యవహరించడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
సందట్లో సడేమియా...
వైట్ హౌస్ కాల్పుల సందర్భంగా...
విలువైన మద్యం పట్టుకెళ్లిన జర్నలిస్టులు! pic.twitter.com/Ov6oL2huwB
— UttarandhraNow (@UttarandhraNow) April 26, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Thirsty Monkey Viral Video | నీళ్ల కోసం నడిరోడ్డు మీద నిలబడి బస్సును ఆపిన కోతి.. గుండెను పిండేసే ఘటన : వీడియో వైరల్
మే 21, 2026

Mohali child kidnapping | దారుణం: తాతయ్య కళ్లెదుటే 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
మే 20, 2026

Rakul Preet Singh | సినిమా ప్రమోషన్స్ తెచ్చిన తంటాలు – వివాదంలో చిక్కుకున్న రకుల్…
మే 11, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



