త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CBSE Exams | మార్చి 2న జ‌రిగే సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు..!

CBSE Exams | అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హ‌త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో గ‌ల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

S

International | Published On Mar 1, 2026, 7.35 pm IST

CBSE Exams | మార్చి 2న జ‌రిగే సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు..!
Advertisement

CBSE Exams | త్రినేత్ర‌.న్యూస్ : అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హ‌త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో గ‌ల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో గ‌ల్ఫ్ రీజియ‌న్‌లో మార్చి 2వ తేదీన నిర్వ‌హించ‌బోయే సీబీఎస్ఈ 10, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు సీబీఎస్ఈ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్, బ‌హ్రెయిన్, కువైట్, ఒమ‌న్‌లో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో సీబీఎస్ఈ పేర్కొంది. వాయిదా ప‌డ్డ పరీక్ష తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. ఇక మార్చి 5వ తేదీన నిర్వ‌హించే ప‌రీక్ష‌ల విష‌యంలో 3వ తేదీన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది.

Advertisement
Advertisement