Swiss Bar Explosion | న్యూఇయర్ వేడుకలు జరుగుతుండగా బార్‌లో భారీ పేలుడు
బ్లాస్ట్ జరిగిన సమయంలో బార్‌లో వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం. అందులో చాలామంది టూరిస్టులే ఉన్నారు. హాలీడే సీజన్ కావడంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడ వేడుకల్లో పాల్గొన్నారు.
International | Published On Jan 1, 2026, 2.22 pm IST
Swiss Bar Explosion | ఓవైపు న్యూ ఇయర్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సడెన్‌గా పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన స్విట్జర్లాండ్‌లోని క్రాన్స్ మొంటానా అనే ఏరియాలో చోటు చేసుకుంది. లె కన్‌స్టెల్లేషన్ అనే బార్‌లో కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యాక అర్ధరాత్రి 1.30 సమయంలో పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పలువురు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.
బ్లాస్ట్ సమయంలో బార్‌లో 100 మంది
బ్లాస్ట్ జరిగిన సమయంలో బార్‌లో వంద మంది వరకు ఉన్నట్లు సమాచారం. అందులో చాలామంది టూరిస్టులే ఉన్నారు. హాలీడే సీజన్ కావడంతో ఎక్కువ మంది పర్యాటకులు అక్కడ వేడుకల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా పేలుడు వల్ల మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. పేలుడు ఎందుకు సంభవించింది? అనే కారణాలు మాత్రం తెలియలేదు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లాస్ట్‌కి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
A severe explosion in the ski town of Crans-Montana in #Switzerland:
the police report several dead and injured in an incident that broke out in the area of the New Year's event.
Emergency forces are on site and an investigation has been opened to determine the cause of the… pic.twitter.com/iioVEjVP1q
— War & Political News (@Elly_Bar_News) January 1, 2026
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | పెద్ది షూటింగ్‌కు ప్యాకప్ – ఫారిన్ ట్రిప్‌లో జాన్వీ…
ఏప్రిల్ 19, 2026

Donald Trump | ఆమె మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు.. అందుకే స్విస్పై టారిఫ్‌ను మరో తొమ్మిది శాతం పెంచా : ట్రంప్
ఫిబ్రవరి 11, 2026

Swiss Mall | హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’..!
జనవరి 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



