త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bill Gates | అందుకు చింతిస్తున్నా.. ఎప్‌స్టీన్‌తో సంబంధాల‌పై బిల్ గేట్స్ ప‌శ్చాత్తాపం

Bill Gates | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న లైంగిక వేధింపుల వ్య‌వ‌హారం ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఎట్ట‌కేల‌కు స్పందించారు.

D

International | Published On Feb 5, 2026, 12.05 pm IST

Bill Gates | అందుకు చింతిస్తున్నా.. ఎప్‌స్టీన్‌తో సంబంధాల‌పై బిల్ గేట్స్ ప‌శ్చాత్తాపం
Advertisement

Bill Gates | ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న లైంగిక వేధింపుల వ్య‌వ‌హారం ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఎట్ట‌కేల‌కు స్పందించారు. జెఫ్రీ కోసం స‌మ‌యం కేటాయించ‌డంపై విచారం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి బిల్ గేట్స్ తొలిసారి స్పందించారు.

"నేను అత‌డితో (జెఫ్రీ ఎప్‌స్టీన్‌) గ‌డిపిన ప్ర‌తి నిమిషానికి ఇప్పుడు చింతిస్తున్నాను. అందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాను. ఆ మెయిల్‌లో ఉన్నది నిజం కాదు. ఆ మెయిల్ ఎప్పుడూ పంపలేదు. అది అవాస్త‌వం. అత‌ని ఆలోచ‌న ఏమిటో నాకు తెలియ‌దు. ఏదో ఒక‌రూపంలో అత‌ను న‌న్ను టార్గెట్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడా..?" అంటూ ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు.

సేవా కార్య‌క్ర‌మాల కోస‌మే..

ఎప్‌స్టీన్‌తో తాను జరిపిన సమావేశాలు కేవలం సేవా కార్యక్రమాల కోసమేనని బిల్ గేట్స్‌ చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఎప్‌స్టీన్ బిలియన్ల కొద్దీ నిధులు సమకూరుస్తానని చెప్పాడని, ఆ ఉద్దేశంతోనే అతడిని కలిసిన‌ట్లు గేట్స్ చెప్పుకొచ్చారు. అయితే, తన జీవితంలో అతడిని కలవడం పెద్ద తప్పు అని ఆయన అంగీకరించారు.

గేట్స్‌కు సెక్సువల్‌ డిసీజ్‌..

అమెరికాలో ఫైనాన్షియ‌ర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఫైల్స్ (Epstein files)కు సంబంధించిన 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. అందులో బిల్‌గేట్స్‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రష్యన్‌ యువతులతో గడిపిన తర్వాత బిల్‌గేట్స్‌కు సెక్సువల్‌ డిసీజ్‌ సోకిందని ఎప్‌స్టీన్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్‌ రాసుకున్న ఈమెయిల్‌ ద్వారా బయటపడింది. రష్యా యువతులతో గేట్స్‌ సెక్స్‌ చేసినట్లు ఎప్‌స్టీన్‌ తన మెయిల్‌లో రాసుకున్నాడు. దీంతో గేట్స్‌ సెక్సువల్‌ డిసీజ్‌ బారిన పడినట్లు పేర్కొన్నాడు. ఇక ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు తన భార్య మెలిండాకు యాంటీబయాటిక్స్‌ ఇవ్వాలని బిల్‌గేట్స్ ప్రయత్నించినట్లు కూడా ఎప్‌స్టీన్‌ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది.

అందుకే బిల్‌గేట్స్‌కు విడాకులిచ్చా.. మెలిండా గేట్స్‌

బిల్ గేట్స్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లపై ఆయ‌న మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates) స్పందించారు. బిల్‌గేట్స్‌కు ఇత‌ర మ‌హిళ‌ల‌తో సంబంధాలు ఉండ‌టంతోనే వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికిన‌ట్లు తెలిపారు. ఆ విషయం తెలిసి తాను ఎంతో మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించిన‌ట్లు మెలిండా చెప్పుకొచ్చారు. "బిల్ గేట్స్‌కు ఇత‌ర మ‌హిళ‌ల‌తో సంబంధాలు ఉన్న‌ట్లు తెలిసి ఎంతో బాధ‌ప‌డ్డాను. ఆ స‌మ‌యంలో చాలా క‌ష్టంగా అనిపించింది. ఎంతో బాధ‌ను అనుభ‌వించాను. అప్ప‌టి జ్ఞాప‌కాలు గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా చాలా బాధ‌గా ఉంటుంది. ఈ కార‌ణంతోనే ఆయ‌న‌తో నా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు ప‌ల‌కాల్సి వ‌చ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ గురించి బ‌య‌ట‌ప‌డిన విష‌యాల‌పై ఆయ‌నే స‌మాధానం చెప్పాలి. నేను కాదు. ఈ కేసులో బాధిత మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నాను" అని మెలిండా చెప్పుకొచ్చారు. ఓ పాడ్ కాస్ట్‌తో మాట్లాడుతూ.. మెలిండా ఈ వ్యాఖ్య‌లు చేశారు. అందుకు సంబంధించిన వీడియోని టెస్లా బాస్ ఎలాన్ మ‌స్క్ ఎక్స్‌లో పోస్టు చేయ‌డంతో అదికాస్తా వైర‌ల్‌గా మారింది.

Advertisement
Advertisement