Bangladesh Elections | ప్రజలు గతాన్ని తిరస్కరించారు.. బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్
Bangladesh Elections | దాదాపు రెండేళ్ల నుంచి తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోన్న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (Bangladesh Elections) జరుగుతున్నాయి.
International | Published On Feb 12, 2026, 1.44 pm IST
Bangladesh Elections | దాదాపు రెండేళ్ల నుంచి తీవ్ర రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటోన్న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (Bangladesh Elections) జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజధాని ఢాకా (Dhaka)లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు అని యూనస్ వ్యాఖ్యానించారు. నేటి ప్రక్రియతో ప్రజలు గతాన్ని తిరస్కరించారన్నారు. “గతంలో ఉన్న పీడకలల వంటి పరిస్థితులను మేము పూర్తిగా బయటకు వచ్చాం. నేటి నుంచి ప్రతి అడుగులోనూ.. ఒక నవ బంగ్లాదేశ్‌ను నిర్మించుకునే అవకాశాన్ని పొందాము” అని యూనస్ పేర్కొన్నారు.
గురువారం ఉదయం 7.30 గంటలకు 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 300 పార్లమెంటు స్థానాలకుగాను 299 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 51 పార్టీలు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP), షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఎ-ఇస్లామీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) జమాత్ ఇస్లామీ కూటమిలో చేరింది.
హసీనా లేకుండా..
2024లో విద్యార్థుల భారీ ఉద్యమంతో మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) నేతృత్వంలోని అవామీ లీగ్ (Awami League) ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతున్నది. తాజా ఎన్నికలతో తాత్కాలిక ప్రభుత్వానికి తెరపడనుంది. కాగా, షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ లేకుండా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఆ పార్టీపై తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ ముగిసన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రేపు ఉదయానికి ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఈ ఫలితాలపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.
సంబంధిత వార్తలు

Bangladesh Oath Ceremony 2026 | భారత్‌కి రండి.. బంగ్లాదేశ్ నూతన ప్రధాని రెహమాన్‌కి స్పీకర్ ఓంబిర్లా ఆహ్వానం
ఫిబ్రవరి 17, 2026

Tarique Rahman | 17న బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారం.. మోదీకీ ఆహ్వానం!
ఫిబ్రవరి 15, 2026

PM Modi | తారిక్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ..?
ఫిబ్రవరి 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



