Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం.. ధ్రువీకరించిన ఇరాన్ మీడియా..
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా సంస్థ ట్రూత్‌లో వెల్లడించారు.
International | Published On Mar 1, 2026, 8.53 am IST
Ayatollah Ali Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా సంస్థ ట్రూత్‌లో వెల్లడించారు. కేవలం ఇరాన్ కు మాత్రమే కాకుండా అమెరికన్లకు కూడా ఇప్పుడు న్యాయం జరిగిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన ప్రజలు ఖమేనీ చేతుల్లో హింసకు గురయ్యారని, చాలా మంది హత్య చేయబడ్డారని అన్నారు. అలాగే అమెరికన్ కమాండర్-ఇన్-చీఫ్ సైతం ట్రూత్ లో పోస్టు పెట్టారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి చెందారని, చరిత్రలో అత్యంత క్రూరుడైన వ్యక్తి ఖమేనీ అని, ఇరాన్ ప్రజలకు ఇప్పుడు తమ దేశాన్ని తాము స్వాధీనం చేసుకునే చక్కని అవకాశం వచ్చిందన్నారు.
40 రోజుల పాటు సంతాప దినాలు..
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టు, ఇజ్రాయెల్ మీడియా వార్తల అనంతరం ఖమేనీ మృతిపై ఇరాన్ స్పందించింది. ఆయన బతికే ఉన్నారని ప్రకటించింది. కానీ ఆ తరువాత కొన్ని గంటలకు ఖమేనీ మృతిని ధ్రువీకరిస్తూ ఇరాన్ మీడియా వార్తలను ప్రసారం చేసింది. ఖమేనీ మృతితో ఇరాన్‌లో 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఓ గొప్ప వీరున్ని ఇరాన్ కోల్పోయిందని అక్కడి ప్రభుత్వం అభిప్రాయపడింది. సుప్రీం లీడర్ ఖమేనీ వీరమరణం పొందారని ఇరాన్‌కు చెందిన స్టేట్ మీడియా సంస్థ ఐఆర్ఐబీ తెలిపింది.
ఖమేనీ మృతిని అక్కడి మీడియా ధ్రువీకరించకముందు ఆయన ఎక్స్ ఖాతా నుంచి ఓ ట్వీట్ వచ్చింది. అందులో ఇన్ ది నేమ్ ఆఫ్ నమీ హైదర్ (పీస్ బీ అపాన్ హిమ్) అని పర్షియన్ భాషలో రాసి ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఖమేనీతోపాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందారు. అలాగే మరో 5 నుంచి 10 మంది ఇరాన్ అగ్ర నాయకులు కూడా ఈ దాడుల్లో మరణించారని అమెరికా భావిస్తుందని ఫాక్స్ న్యూస్ తెలిపింది.
పక్కాగా ప్లానింగ్..
ఖమేనీ కదలికలను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా గత కొంత కాలంగా ట్రాక్ చేసి ఈ ఆపరేషన్‌ను ఇప్పుడు విజయవంతంగా నిర్వహించారు. అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సీఐఏ, ఇజ్రాయెల్ మొస్సాద్‌లు పక్కాగా ప్లాన్ చేసి ఖమేనీ కార్యాలయం, నివాసాలపై ఏకకాలంలో దాదాపు 30కి పైగా గైడెడ్ మిస్సైల్స్‌తో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లోనే ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ కాంపౌండ్ మొత్తం ధ్వంసం అయిందని ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. మిస్సైల్ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ నసీర్‌జాదె, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పక్‌పోర్ మృతి చెందారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






