Pakisthan | పాక్‌పై ఆకస్మిక దాడి.. 8 అవుట్‌పోస్టులు అఫ్గాన్ హస్తగతం
Afghanistan, Pakistan/ అఫ్గానిస్థాన్-పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి తర్వాత తాలిబన్ (Thaliban) దళాలు అంతర్జాతీయ సరిహద్దు ‘డ్యూరాండ్ రేఖ’ దాటి పాక్ భూభాగంలోకి చొరబడ్డాయి. వెంటనే భీకర దాడులు (Attack) ప్రారంభించాయి.
International | Published On Mar 3, 2026, 5.57 pm IST
త్రినేత్ర.న్యూస్: Afghanistan, Pakistan/ అఫ్గానిస్థాన్-పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి తర్వాత తాలిబన్ (Thaliban) దళాలు అంతర్జాతీయ సరిహద్దు ‘డ్యూరాండ్ రేఖ’ దాటి పాక్ భూభాగంలోకి చొరబడ్డాయి. వెంటనే భీకర దాడులు (Attack) ప్రారంభించాయి. ఈ ఆకస్మిక దాడిలో పాక్‌కు చెందిన 8 కీలక సైనిక అవుట్ పోస్టులను అఫ్గాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాందహార్ ప్రావిన్స్‌లో ఐదు, ఖోస్ట్‌లో రెండు, జబుల్ ప్రావిన్స్ (Zabul pravins) లో ఒక సైనిక పోస్టును తమ దళాలు హస్తగతం చేసుకున్నట్లు అఫ్గాన్ డిప్యూటీ ప్రతినిధి సెదిఖుల్లా నుస్రత్ (Sedikhulla Nusrath) తెలిపారు. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో సరిహద్దును దాటినట్లు చెప్పారు. ముగ్గురు పాక్ సైనికులను హతమార్చి, మరొకరిని సజీవంగా పట్టుకున్నామన్నారు. వాయుసేనలోనూ అఫ్గాన్ దళాలు పాక్‌కు చెందిన నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు వివరించారు.
జబుల్ ప్రావిన్స్‌లోని షాముల్జాయ్ జిల్లాలో ఒక డ్రోన్, కందహార్ (Kandahar) పరిసరాల్లో మరో డ్రోన్ (Drone) ను అఫ్గాన్ దళాలు కూల్చివేశాయి. కాబూల్‌తో పాటు అఫ్గాన్ లోని ఇతర ప్రాంతాలపై పాక్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు తాలిబన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అఫ్గాన్ వైమానిక దళం పాక్‌లోని రావల్పిండి, క్వెట్టా, ఖైబర్ పఖ్తున్ఖ్వా తదితర కీలక ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. పక్తికా ప్రావిన్స్‌లోని అంగూర్ ఆదా బేస్ సమీపంలో పాకిస్తాన్‌కు చెందిన సాయుధ ట్యాంకును పూర్తిగా ధ్వంసమైంది. 30కి పైగా చెక్ పోస్టులు అఫ్గాన్ వశమయ్యాయని సమాచారం. రెండు దేశాల మధ్య కాల్పుల జరుగుతుండడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



