త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament | పార్ల‌మెంట్‌లో అనూహ్య ప‌రిణామం.. కొట్టుకున్న నేత‌లు

Parliament | తుర్కియే పార్ల‌మెంట్ (Turkeys parliament)లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

D

International | Published On Feb 12, 2026, 10.13 am IST

Parliament | పార్ల‌మెంట్‌లో అనూహ్య ప‌రిణామం.. కొట్టుకున్న నేత‌లు
Advertisement

Parliament | తుర్కియే పార్ల‌మెంట్ (Turkeys parliament)లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో స‌భ్యులు ఒక‌రిపై ఒక‌రు పంచులు విసురుకుంటూ దాడి చేసుకున్నారు. కొత్త న్యాయ‌శాఖ మంత్రి నియామ‌కంపై ఘ‌ర్ష‌ణ చెల‌రేగిన‌ట్లు తెలిసింది.

మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ఇస్తాంబుల్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ అయిన అకిన్‌ గుర్లెక్ (Akin Gurlek)ను ఆ దేశ కొత్త న్యాయ‌శాఖ మంత్రిగా అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ (Recep Tayyip Erdogan) నియ‌మించారు. దీంతో ఆయ‌న పార్ల‌మెంట్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. న్యాయమంత్రిత్వ శాఖ‌కు గుర్లెక్ నియమించ‌డంపై ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్‌ పీపుల్స్‌ పార్టీ (CHP) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది.

గుర్లెక్ రాజ‌కీయ ప‌క్ష‌పాతంతో ఉన్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిప‌క్ష‌నేత‌లు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. పోడియం వ‌ద్ద‌కు దూసుకొచ్చి గంద‌ర‌గోళం సృష్టించారు. ఈ క్ర‌మంలో అక్క‌డ తీవ్ర ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఒక‌రిపై ఒకరు ప‌రస్ప‌రం దాడులు చేసుకున్నారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ ఉద్రిక్త‌త నేప‌థ్యంలో ప్రమాణస్వీకార కార్య‌క్ర‌మాన్ని స్పీక‌ర్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికి స‌మావేశం ప్రారంభం కాగానే.. అధికార పార్టీ నేత‌ల అండ‌తో గుర్లెక్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://x.com/BRICSinfo/status/2021707161462554882

Advertisement
Advertisement