NASA | త్వరలోనే అమెరికా మళ్లీ చంద్రుడిపై అడుగుపెడుతుంది.. వ్యోగాములతో ట్రంప్..
NASA | నాసా వ్యోమగాములు ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా వ్యోమగాములు ప్రస్తుతం భూమివైపుగా ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్ కమాండర్ రీడ్‌వైజ్ మ్యాన్ మాట్లాడుతూ తాము మిషన్ పూర్తిగా దృష్టి సారించామని, రెండోదశపై ఉత్సాహంగా ఉన్నామన్నారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడిని సమగ్రంగా పరిశీలించి, ఇప్పటివరకు ఎవరూ చూడని ఉపరితల భాగాలను చిత్రీకరించారు.
International | Published On Apr 7, 2026, 12.37 pm IST
NASA | నాసా వ్యోమగాములు ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగంగా వ్యోమగాములు ప్రస్తుతం భూమివైపుగా ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్ కమాండర్ రీడ్‌వైజ్ మ్యాన్ మాట్లాడుతూ తాము మిషన్ పూర్తిగా దృష్టి సారించామని, రెండోదశపై ఉత్సాహంగా ఉన్నామన్నారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడిని సమగ్రంగా పరిశీలించి, ఇప్పటివరకు ఎవరూ చూడని ఉపరితల భాగాలను చిత్రీకరించారు. ఈ సమయంలో చంద్రుడు, సూర్యుడు మధ్యలో ఉండడంతో స్పేస్ షటిల్ నుంచే వారికి వ్యక్తిగత సూర్యగ్రహణం కనిపించింది. ఈ గ్రహణం దాదాపు గంటపాటు కొనసాగింది. సూర్యుడి కరోనా భాగాన్ని పరిశీలించే అవకాశం లభించింది. ఇక ఈ ప్రయాణంలో వ్యోమగాములు చంద్రుడిపైని కొన్ని ప్రాంతాలకు పేర్లు కూడా పెట్టారు. ఒరియన్ అంతరిక్ష నౌకతో పాటు కమాండర్ వైజ్‌మన్ దివంగత భార్య క్యారోల్ స్మారకార్థంగా ఈ పేర్లు నిర్ణయించారు. నాసా ఈ చారిత్రాత్మక ప్రయాణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. “మీరు చరిత్ర సృష్టించారు. అమెరికాను గర్వపడేలా చేశారు. మీ మిషన్ త్వరలోనే అమెరికాను తిరిగి చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్తుంది” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వ్యోమగాములు ట్రంప్‌తో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ మిషన్‌లో భాగంగా చంద్రుడి చుట్టూ ప్రయాణించిన వ్యోమగాములు జాబిల్లి ఉపరితలంపై ఆశ్చర్యకరమైన రంగుల మార్పులను గమనించారు. సాధారణంగా తెల్లటి వర్ణంలో కనిపించే చంద్రుడు, సమీపం నుంచి చూస్తే విభిన్న ఛాయల్లో కనిపించిందని తెలిపారు. చంద్రుడి ఉపరితలం ఎక్కువ భాగం బ్రౌన్ రంగులో కనిపించిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా ఆకుపచ్చ వర్ణపు ఛాయలు కనిపించాయని పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే జాబిల్లి ఉపరితలం ఏకరీతిగా కాకుండా విభిన్న రంగుల కలయికగా కనిపించిందన్నారు. మిషన్ స్పెషలిస్టు క్రిస్టినా మాట్లాడుతూ చంద్రుడిని దగ్గరగా పరిశీలించిన కొద్దీ బ్రౌన్ రంగు మరింత స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ అనుభవం ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని తెలిపింది. కెనడియన్ వ్యోమగామి జెర్మీ హన్సెన్ మాట్లాడుతూ.. ఆరిస్టార్కస్ పీఠభూమి ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఆకుపచ్చ ఛాయలో కనిపించిందన్నారు. భౌగోళిక నిర్మాణం కొత్తదిగా ఉండటంతో, ఆ ప్రాంతంలో కనిపించిన రంగు ప్రత్యేకంగా అనిపించిందని, చంద్రుడి ఇతర ప్రాంతాల్లో ఇలాంటి రంగు తాను చూడలేదన్నారు. ఇదిలా ఉండగా..
ఇక ఈ మిషన్ సందర్భంగా అంతరిక్ష నౌక భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించినట్లు నాసా తెలిపింది. సుమారు 2.5 లక్షల మైళ్ల దూరం వరకు ఈ ప్రయాణం సాగిందని తెలిపారు. నాసా చరిత్రలో ఇంత దూరం వరకు మానవులు ప్రయాణించడం ఇదే తొలిసారని స్పష్టం చేశారు. ఈ విజయంపై మిషన్ బృందాన్ని అభినందించారు. అదే సమయంలో మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చేందుకు మరో నాలుగురోజుల పాటు సమయం పట్టనుంది. శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్‌తో ఈ పరీక్షా ప్రయాణం ముగియనుంది. నాసా ఈ మిషన్‌కు సంబంధించిన ప్రతి ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






