Khawaja Asif | మా దేశాన్ని అమెరికా వాడుకుంది.. ఆ నష్టాన్ని ఎప్పటికీ భర్తీచేయలేం : పాక్ మంత్రి
Khawaja Asif | అమెరికాపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇస్లామాబాద్‌ను వాడుకుందని వ్యాఖ్యానించారు.
International | Published On Feb 11, 2026, 1.01 pm IST
Khawaja Asif | అమెరికాపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇస్లామాబాద్‌ను వాడుకుందని వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
1999 తర్వాత అమెరికాతో పాకిస్థాన్ చేతులు కలపడం చాలా పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పాక్‌కు శాశ్వత నష్టాన్ని కలిగించిందని తెలిపారు. 'అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికాతో చేతులు కలపడం మనం చేసిన అతిపెద్ద తప్పు. దాని వల్ల పాక్ చాలా నష్టపోయింది. దాని పర్యావసానాలను ఇప్పటికీ అనుభవిస్తున్నాం. అమెరికా మన దేశాన్ని తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకుంది. ఇస్లామాబాద్‌ను టాయిలెట్ పేపర్‌కంటే దారుణంగా తీసిపడేసింది. అవసరం తీరిన తర్వాత పాకిస్థాన్‌ను అమెరికా పట్టించుకోలేదు. పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటువంటి సాయమూ చేయలేదు' అని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.
2001, సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపి తాలిబన్లకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఖవాజా ఆసిఫ్ తెలిపారు. అమెరికాతో కలిసి తాలిబన్లతో యుద్ధానికి దిగినట్లు చెప్పారు. కానీ, కొద్ది సంవత్సరాల తర్వాత అమెరికా వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఆ యుద్ధం కారణంగా పాక్ మాత్రం హింస, తీవ్రవాదం, ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకుపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాతో చేతులు కలపడం వల్ల నష్టాలు కొని తెచ్చుకున్నట్లైందని వ్యాఖ్యానించారు. ఆ నష్టాలను ఎప్పటకీ భర్తీచేయలేమని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






