త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air India | ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. ఎయిరిండియా విమానాలు ర‌ద్దు.. జాబితా ఇదే..

Air India | త్రినేత్ర‌.న్యూస్ : ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయా విమాన‌యాన సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు చేసింది.

S

International | Published On Mar 1, 2026, 10.10 am IST

Air India | ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. ఎయిరిండియా విమానాలు ర‌ద్దు.. జాబితా ఇదే..
Advertisement

Air India | త్రినేత్ర‌.న్యూస్ : ప‌శ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయా విమాన‌యాన సంస్థ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క సూచ‌న‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతర్‌తో పాటు యూర‌ప్ దేశాల‌కు కూడా ఎయిరిండియా త‌మ విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసింది.

మధ్యప్రాచ్యంలో మారుతున్న పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్న‌ట్లు ఎయిరిండియా పేర్కొంది. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే షెడ్యూల్ చేసిన విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశాం. మ‌రిన్ని విమాన స‌ర్వీసుల‌ను కూడా త‌గ్గిస్తున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. అయితే ప్ర‌యాణికుల‌కు ఏర్ప‌డిన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ర‌ద్ద‌యిన ఎయిరిండియా విమానాల జాబితా ఇదే..

AI131/ AI130: ముంబై-లండన్ (హీత్రో) / లండన్ (హీత్రో)-ముంబై
AI113/ AI118: ఢిల్లీ- బర్మింగ్‌హామ్ / బర్మింగ్‌హామ్-ఢిల్లీ
AI155/ AI156: ఢిల్లీ-ఆమ్‌స్ట‌ర్‌డామ్ / ఆమ్‌స్ట‌ర్‌డామ్-ఢిల్లీ
AI151/ AI152: ఢిల్లీ-జురిచ్ / జ్యూరిచ్-ఢిల్లీ
AI137 / AI138: ఢిల్లీ-మిలన్ / మిలన్-ఢిల్లీ
AI153 / AI154: ఢిల్లీ-వియన్నా / వియన్నా-ఢిల్లీ

AI133 / AI132: బెంగళూరు-లండన్ (హీత్రో) / లండన్ (హీత్రో)-బెంగళూరు
AI157 / AI158: ఢిల్లీ-కోపెన్‌హాగన్ / కోపెన్‌హాగన్/ఢిల్లీ
AI2017 / AI2018, AI2015/AI2016: ఢిల్లీ-లండన్ (హీత్రో) / లండన్ (హీత్రో)- ఢిల్లీ
AI2029 / AI2030: ఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ / ఫ్రాంక్‌ఫర్ట్-ఢిల్లీ

Advertisement
Advertisement