Suicide Bombing | పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి
Suicide Bombing | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad)లోని ఓ ప్రార్థనా మందిరం వెలుపల ఆత్మాహుతి దాడి (Suicide Bombing) జరిగింది. ఈ దాడిలో 30 మందికిపైగా మరణించారు.
International | Published On Feb 6, 2026, 4.17 pm IST
Suicide Bombing | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad)లోని ఓ ప్రార్థనా మందిరం వెలుపల ఆత్మాహుతి దాడి (Suicide Bombing) జరిగింది. ఈ దాడిలో 20 మందికిపైగా మరణించారు. సుమారు 169 మంది గాయపడ్డారు. నగరంలోని షెహ్జాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్‌బర్గ్ (Tarlai Imambargah) వద్ద శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించింది.
పాక్ మీడియా నివేదికల ప్రకారం.. తర్లై ఇమామ్‌బర్గ్ ప్రధాన ద్వారం వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన సమయంలో పేలుడు సంభవించడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది. ఇప్పటి వరకూ 31 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇది ఆత్మాహుతి దాడిగా అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ ఉగ్ర సంస్థా బాధ్యత వహించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిని పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



