త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | నీళ్లు లేవంటున్న‌వ్.. అస‌లు నువ్వే లేకుంటే ద‌రిద్రం పోయేది: ఎమ్మ‌ల్యే వివేకానంద‌

KP Vivekananda | రాష్ట్రంలో నిధులు లేవు, నీరు లేదు అని చెప్పే బ‌దులు అస‌లు నువ్వే లేక‌పోతే ఈ ద‌రిద్రం ఉండేది కాద‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండి ప‌డ్డారు. ప్రజల నీటి కష్టాల‌ను తీర్చకపోతే జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇళ్లును ముట్టడిస్తామ‌ని ఆయ‌న హెచ్చిరంచారు.

S

Hyderabad | Published On May 18, 2026, 3.14 pm IST

KP Vivekananda | నీళ్లు లేవంటున్న‌వ్.. అస‌లు నువ్వే లేకుంటే ద‌రిద్రం పోయేది: ఎమ్మ‌ల్యే వివేకానంద‌
Advertisement
  • గాలి మోట‌ర్ల‌ల్ల మూట‌లు మోసుడు కాదు
  • రిజ‌ర్వాయ‌ర్ల సుట్టు తిరిగి నీటి క‌ష్టాలను తీర్చు
  • ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరువ్‌
  • లేదంటే నీ ఇంటిని ముట్ట‌డిస్తం
  • సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే కేపీ వివేకానంద హెచ్చ‌రిక‌

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్రంలో నిధులు లేవు, నీరు లేదు అని చెప్పే బ‌దులు అస‌లు నువ్వే లేక‌పోతే ఈ ద‌రిద్రం ఉండేది కాద‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండి ప‌డ్డారు. సీఎం రేవంత్ ఇప్పటికైనా నిద్రలేచి చూడాలని.. ప్రజల నీటి కష్టాల‌ను తీర్చకపోతే జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇళ్లును ముట్టడిస్తామ‌ని ఆయ‌న హెచ్చిరంచారు. కుత్బుల్లాపూర్ లోని ఐడీపీఎల్ లోని HMWS-Sb వాటర్ వర్క్స్ ముందు ఎంఎల్ఏ వివేకానంద ఆధ్వ‌ర్యంలో నియోజకవర్గ మహిళలు ఖాళీ బిందెలతో సోమ‌వారం ధర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై విమ‌ర్శలు గుప్పించారు. గాలిమోటర్ లో మూటలతో ఢిల్లీకి పోవుడు కాదని.. రిజర్వాయర్ ల చుట్టూ తిరిగి ప్రజల నీటి దప్పిక తీర్చాల‌ని డిమాండ్ చేశారు.

ఆడ‌బిడ్డ‌ల క‌ష్టం తీర్చిన మ‌హ‌నీయుడు కేసీఆర్‌..

బీఆర్ఎస్ హ‌యాంలో ప్రతి ఆడబిడ్డ కష్టం తీర్చిన మనిషి కేసీఆర్. పలు రిజర్వాయర్లు కట్టి ప్రతి మహిళ నీటికష్టాన్ని తీర్చిన మహనీయుడు కేసీఆర్. గడిచిన 3 ఏళ్లల్లోనే రేవంత్ సర్కార్ ఆధ్వ‌ర్యంలో నీటి సరఫరా బంద్ చేసి మునపటి కీర్తికి శ్రీకారం చుట్టిన ఘనత రేవంత్ రెడ్డికే ద‌క్కుతుంది. ప్రిన్సిపాల్ సెక్రటరీ, బోర్డ్ ఎండీ తో మాట్లాడాను. వాటర్ సప్లై పై చర్యలు శూన్యంగా ఉన్నాయ‌ని వివ‌రించాను. ప్రతి కాలనీ, ప్ర‌తి బస్తీలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఇళ్లలోని వాటర్ పైప్ లలో వాటర్ ప్రెజర్ లేదు. రేవంత్ రెడ్డి గాలీ మోటర్ లో తిరిగి గాలి మాటలు మాట్లాడంలో మాత్రం ప్రెజర్ ఉంది అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

ప్ర‌జ‌ల మీద శ్ర‌ద్ధ పెట్టు..

ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో లేదు. హైదరాబాద్ తో పాటు కుత్బుల్లాపూర్ లో తీవ్రంగా ఉన్న నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా పెట్టి నీటి ట్యాంకర్ల భాదను కేసీఆర్ తీర్చిండు. రేవంత్ హయాంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అదే నీటి ట్యాంకర్ల దందాకు తెరలేపింది. ప్రజలను గోస పెడుతూ రాష్ట్రంలో కాసుల వేట, డబ్బుల మూటలను ఢిల్లీకి చేర్చడమే రేవంత్ ప‌నిగా పెట్టుకున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరవకపోతే బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో రేవంత్ మెడలు వంచి నీటి సమస్య పరిష్కర‌మ‌య్యే వరకు పోరాటం ఆపం అని వివేకానంద హెచ్చిరించారు.

Advertisement
Advertisement