CAT | పిల్లి వైద్యానికి రూ. లక్ష.. మూడుసార్లు సర్జరీ చేసినా కుదుటపడని ఆరోగ్యం
CAT | ఓ మహిళ పిల్లిని (CAT) పెంచుకుంటున్నది. దానిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నది. అనుకోకుండా అది అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యునికి చూపించగా దానికి సర్జరీ (Surgery) చేయాలన్నారు. అలా మూడు సార్ల శస్త్రచికిత్స చేసినా దాని ఆరోగ్యం బాగుకాలేదు.
CAT | త్రినేత్ర.న్యూస్: ఓ మహిళ పిల్లిని (CAT) పెంచుకుంటున్నది. దానిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నది. అనుకోకుండా అది అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యునికి చూపించగా దానికి సర్జరీ (Surgery) చేయాలన్నారు. అలా మూడు సార్ల శస్త్రచికిత్స చేసినా దాని ఆరోగ్యం బాగుకాలేదు. దీంతో సర్జరీల పేరుతో రూ.లక్ష వసూలు చేశారు. అయినా అది మునపటిలా కాలేదంటూ వైద్యం డాక్టర్‌ను నిలదీసింది. అతడు దురుసుగా మాట్లాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) వనస్థలిపురంలో చోటుచేసుకున్నది.
వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన పెండ్యాల శాంభవీదేవీ గత మూడేండ్లుగా మగ పర్షియన్ పిల్లిని పెంచుకుంటున్నారు. గతేడాది ఆగస్టులో అది అనారోగ్యానికి గురైంది. దీంతో అదేనెల 27న రామకృష్ణాపురం సమీపంలోని అల్కాపురిలో ఉండే స్నిఫర్స్ పెట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఆ పిల్లిని పరిశీలించిన డాక్టర్ క్రాంతికుమార్.. మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతున్నదని చెప్పారు. ఆమె అంగీకరించడంతో అదేరోజు శస్త్రచికిత్స చేశారు.
అయితే సర్జరీ సమయంలో పిల్లి కదలడంతో దాని శరీరంలో అమర్చిన పైపు పక్కకు జరిగిందని, మళ్లీ సర్జరీ చేయాలని చెప్పారు. ఆమె ఓకే చెప్పడంతో దానికి మరోసారి శస్త్రచికిత్స చేశారు. అయినా పిల్లి ఆరోగ్యం కుదుటపడకపోగా, పరిస్థితి మారింది. దీంతో గత డిసెంబర్‌లో దవాఖానకు తీసుకెళ్లారు. డాక్టర్ క్రాంతి కుమార్ మరోసారి దానికి సర్జరీ చేసి ఇంటికి పంపించారు. అయినప్పటకీ దాని ఆరోగ్యం మెరుగుపడటక పోవడంతో డాకర్టర్‌ను శాంభవీదేవి నిలదీశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్.. ఆమెను అసభ్యపదజాలంతో దుర్భాషలాడారు. మరోసారి హాస్పిటల్‌కు వస్తే చంపేస్తానంటూ బెదిరించారు. తర్వాత పిల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళనకు గురైన ఆమె జనవరి 31న డాక్టర్‌కు ఫోన్ చేసింది. ఇకపై దానికి వైద్యం చేయనని, ఇంకోసారి ఫోన్ చేయొద్దని దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె చైతన్యపురి పోలీసులను ఆశ్రయించారు. రూ.లక్ష వరకు ఫీజు తీసుకొని మూడు శస్త్రచికిత్సలు చేశారని, ఇప్పటికీ పిల్లి అనారోగ్యంతోనే ఉన్నట్లు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






