త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alcohol | భ‌ర్త మందు తీసుకురాలేద‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న భార్య‌

Alcohol | ఓ మ‌హిళ మ‌ద్యానికి (Alcohol) బానిస‌గా మారింది. రోజూ మందు తాగ‌డం త‌ప్ప‌నిసరిగా మారిపోయింది. అలా ఓ రోజు ఇంట్లో ఉన్న మ‌ద్యం అయిపోయింది. దీంతో ఇంకా తీసుకురావాల‌ని భ‌క్తుకు చెప్పింది.

G

Hyderabad | Published On Jan 27, 2026, 11.38 am IST

Alcohol | భ‌ర్త మందు తీసుకురాలేద‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న భార్య‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఓ మ‌హిళ మ‌ద్యానికి (Alcohol) బానిస‌గా మారింది. రోజూ మందు తాగ‌డం త‌ప్ప‌నిసరిగా మారిపోయింది. అలా ఓ రోజు ఇంట్లో ఉన్న మ‌ద్యం అయిపోయింది. దీంతో ఇంకా తీసుకురావాల‌ని భ‌క్తుకు చెప్పింది. అయితే అత‌డు తేక‌పోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌న హైద‌రాబాద్ (Hyderabad) మ‌ధురాన‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో జ‌రిగింది.

యూసుఫ్‌గూడ‌లోని ఎల్ఎన్ న‌గ‌ర్‌కు చెంది రాజేశ్వ‌రి (45), శివ‌కుమార్ దంప‌తులు. వారికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. మ‌ద్యానికి బానిసైన రాజేశ్వ‌రి.. రోజూలానే ఈ నెల 25న మ‌ద్యం సేవించింది. అయితే త‌న‌కు ఇంకా మందు కావాల‌ని భ‌ర్త‌కు చెప్పింది. దీనికి అత‌డు కాద‌ని చెప్పాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

ఈ క్ర‌మంలో గదిలోకి వెళ్లిన ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత త‌ల్లి క‌నిపించ‌క‌పోవ‌డంతో.. చిన్న కుమారుడు గౌతమ్ ఆమె కోసం వెదికాడు. గ‌దిలోకి వెళ్లి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. చుట్టుపక్క‌ల వారిని పిల‌వ‌డంతో.. తలుపులు పగులకొట్టి ఆమెను కిందకు దించారు. అనంత‌రం ప్రైవేటు ద‌వాఖాన‌కు తరలించగా అప్పటికే మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. రాజేశ్వరి సోదరుడు దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు మేరకు కేసు న‌మోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement