త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | రోజూ తాగివ‌చ్చి వేధిస్తున్నాడని.. భర్తను చంపిన భార్య

Murder | అత‌డు మార్కెటింగ్ మేనేజ‌ర్‌ (Marketing Manager). భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. రోజూ తాగివ‌చ్చి ఆమెను వేధిస్తున్నాడు. చాలా రోజులుగా భ‌రిస్తూ వ‌స్తున్న ఆమెకు ఓపిక న‌శించింది. మెడ‌కు చున్నీ భిగించి చంపేసింది (Murder).

G

Hyderabad | Published On Jan 21, 2026, 7.03 am IST

Murder | రోజూ తాగివ‌చ్చి వేధిస్తున్నాడని.. భర్తను చంపిన భార్య
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: అత‌డు మార్కెటింగ్ మేనేజ‌ర్‌ (Marketing Manager). భార్య‌పై అనుమానం పెంచుకున్నాడు. రోజూ తాగివ‌చ్చి ఆమెను వేధిస్తున్నాడు. చాలా రోజులుగా భ‌రిస్తూ వ‌స్తున్న ఆమెకు ఓపిక న‌శించింది. మెడ‌కు చున్నీ భిగించి చంపేసింది (Murder). ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌ప‌డి మృతిచెందాడ‌ని అంద‌రినీ న‌మ్మించింది. అయితే పోస్టుమార్టంలో అస‌లు విష‌యం తెలింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు జిల్లా నూజివీడు స‌మీపంలోని తూర్పుదిగ‌వ‌ల్లి గ్రామానికి చెందిన జ‌గ్గ‌వ‌ర‌పు సుధీర్‌రెడ్డి (44), బ్ర‌హ్మ జ్ఞాన‌ప్ర‌స‌న్న దంప‌తులు.. కొన్నేండ్లుగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో నివాసం ఉంటున్నారు. సుధీర్ ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స‌న్న ఇంట్లోనే ఉన్నారు. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి అనుమానం ఉండేది. దీంతో రోజూ గొడవలు జరుగుతుండేవి.

ఈక్ర‌మంలో డిసెంబరు 23న రాత్రి తాగిన మైకంలో తన భర్త మంచం కోడుకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు జ్ఞానప్రసన్న తన బంధువులు, ఇరుగు పొరుగువారిని నమ్మించారు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో సుధీర్‌రెడ్డి హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది. దీంతో ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారించ‌గా తానే హ‌త్య‌చేసిన‌ట్లు అంగీక‌రించింది. రోజూ తాగొచ్చి వేధిస్తున్నాడ‌ని, అందుకే అత‌ని గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు తెలిపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement