త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Protest | రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ‘వాక్ ఫ‌ర్ వాట‌ర్’.. బీఆర్ఎస్ భారీ నిర‌స‌న

BRS Protest | రాజేంద్ర న‌గ‌ర్ (Rajendra Nagar) నియోజకవర్గంలో తీవ్ర నీటి స‌మ‌స్య‌తో స్థానిక ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని, ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్ (MLA Prakash goud) ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు నాలుగు రోజులు కూడా స‌క్ర‌మంగా తాగు నీరు ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు కార్తీక్‌రెడ్డి (Karthik Reddy) ఆవేదన చెందారు. స్థానిక ప్ర‌జ‌లు ఖాళీ బిందెల‌తో నిర‌స‌న తెలిపారు.

S

Hyderabad | Published On May 17, 2026, 1.33 pm IST

BRS Protest | రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ‘వాక్ ఫ‌ర్ వాట‌ర్’.. బీఆర్ఎస్ భారీ నిర‌స‌న
Advertisement
  • ఖాళీ బిందెల‌తో నిర‌స‌న తెలిపిన స్థానికులు, బీఆర్ఎస్ నాయ‌కులు
  • కార్తీక్‌రెడ్డికి విన‌తిప‌త్రాలు అంద‌జేసిన బాధిత‌ ప్ర‌జ‌లు

BRS Protest త్రినేత్ర‌.న్యూస్‌: రాజేంద్ర న‌గ‌ర్ (Rajendra Nagar) నియోజకవర్గంలో తీవ్ర నీటి స‌మ‌స్య‌తో స్థానిక ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని, ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్ (MLA Prakash goud) ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు నాలుగు రోజులు కూడా స‌క్ర‌మంగా తాగు నీరు ఇవ్వ‌లేక‌పోతున్నార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు కార్తీక్‌రెడ్డి (Karthik Reddy) ఆవేదన చెందారు. ఈ క్ర‌మంలో నార్సింగిలో మహిళలతో కలిసి 'వాక్ ఫర్ వాటర్' పాదయాత్ర చేప‌ట్టారు. ఇందులో స్థానిక ప్ర‌జ‌లు పాల్గొని ఖాళీ బిందెల‌తో నిర‌స‌న తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్ర అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో కార్తీక్ రెడ్డి మాట్లాడారు.

ఆఘ‌మేఘాల‌పై అధికారుల‌తో చ‌ర్చ‌లు..

ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రజలకు నాలుగు రోజులు కూడా సక్రమంగా మంచినీరు ఇవ్వలేకపోతున్నాడు. మంచినీటి సరఫరాపై స్థానిక ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేకపోవడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయి. నియోజకవర్గంలో సరిపడా నీటిని అందిస్తున్నామని అధికారులు చెప్పడం వివేక శూన్యం. పాదయాత్ర పొడవునా కనిపిస్తున్న వాటర్ ట్యాంకర్లే ఇక్కడి నీటి ఎద్దడికి ప్రత్యక్ష నిదర్శనం. మేము మంచినీటి సమస్యపై పోరాటం ప్రారంభిస్తున్నామని తెలిసి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆఘమేఘాలపై అధికారులతో చర్చలు జరిపారు. ఇప్పటివరకు ఆయనకు ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా? అని కార్తీక్ రెడ్డి ప్ర‌శ్నించారు.

అంత‌కుముందు నిర‌స‌న‌లో భాగంగా నార్సింగి చౌరస్తా నుండి వాటర్ వర్క్స్ ఆఫీస్ వరకు మహిళలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు కార్తీక్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలను అందజేశారు.

Advertisement
Advertisement