Uttam Kumar Reddy |పాలమూరు ప్రాజెక్టుకు ఏ అనుమతులూ లేవు. కేసీఆర్ వి అన్నీ అబద్ధాలే
45 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది అవాస్తవం... హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదు.
Uttam Kumar Reddy | తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై గత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు దుర్మార్గంగా బరితెగించి అబద్దాలు చెప్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం రెండేళ్లలో తమ ప్రభుత్వం 7 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఏ అనుమతులు లేవు.. కేసీఆర్ అబద్ధాలు చెప్పారన్నారు.
45 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది అవాస్తవం... హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదు. 2020లో సెంట్రల్ కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, SLBC, డిండికి నీళ్లు అడుగలేదు.
పదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. 1.83 లక్షల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చు చేశామని చెబుతున్న బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కట్టిన ప్రాజెక్టలతోనే నీళ్లను పంపిణి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశాం. వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న. మా ప్రభుత్వంలో పాలమూరుకు ఖర్చు చేసిన 7 వేల కోట్ల లెక్కలు చెప్తం. హరీష్ రావు కమిషన్లు అంటున్నారు.. మీ అలవాట్లు మాకు లేవు. ఏదో అద్భుతాలు చేసినట్లు కేసీఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉంటాయి. అసెంబ్లీలో పీపీటీ అవకాశం నిబంధనల ప్రకారం నడుస్తుంది. అంతే కానీ ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చామంటూ అవాకులు చెవాకులు పేలొద్దంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



