Bottle Blast | బాటిల్‌పై కాలు పెట్టడంతోనే భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు.. వీడియో
Bottle Blast | బాటిల్‌పై కాలు వేయగానే భారీ పేలుడు (Bottle Blast) సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు గాయడ్డారు.
Bottle Blast | త్రినేత్ర న్యూస్: బాటిల్‌పై కాలు వేయగానే భారీ పేలుడు (Bottle Blast) సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు గాయడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కాటేదాన్ పారిశ్రామిక వాడలో (Katedan Industrial Area) మంగళవారం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఎంఎస్ ట్రేడర్స్ పరిశ్రమ ఉంది. ఇది ప్లాస్టిక్ సీసాలు, ఇతర వస్తువులను (Scrap Collection Unit) సేకరిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ప్లాస్టిక్ సీసాలన్నింటినీ ఒకచోట చేర్చి, వాటిని కంప్రెస్ చేసి ఇతర పరిశ్రమలకు పంపిస్తారు. ఈ క్రమంలో పరిశ్రమలో పని చేసే మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ (20) ఓ సీసాపై కాలు వేశారు. దీంతో అది ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ పేలిపోయింది (Exploded). దీంతో తీవ్రంగా గాయపడిన అతడు కుప్పకూలిపోయారు. సమీపంలో ఉన్న మరో కార్మికుడు దిలీప్ (52) కూడా గాయపడ్డారు. అక్కడే ఉన్నవారు వారిద్దరిని దవాఖానకు తరలించారు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది. కాగా, బాటిల్లో రసాయనాలు ఉండటంతోనే పేలుడు సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
💥 Plastic container explodes under worker’s foot, 2 injured in Hyderabad
📹 A routine workday turned dangerous when a plastic container suddenly exploded at a scrap collection unit in Katedan industrial area on Tuesday afternoon. CCTV footage captured the moment of the blast.
⚠️ The incident occurred around 3 pm at M/S Traders, where workers Sai and Dileep were shifting sacks. After a ripped sack spilled some items, Sai pressed a plastic container with his left foot. As he tried to kick it away after noticing smoke, it exploded, throwing him a few feet away.
🚑 Sai suffered injuries to his left foot and burn injuries, while Dileep sustained minor injuries. Both are undergoing treatment at Osmania General Hospital.
🔎 Police have collected evidence for forensic analysis to identify the chemical involved.
#Hyderabad #CCTVFootage #Katedan #Blast #BreakingNews
— TOI Hyderabad (@TOIHyderabad) October 27, 2026
తాజావార్తలు
- ●Jio Platforms IPO | జియో ఐపీవో ఇన్వెస్టర్లపై కనకవర్షం.. 21 శాతం లాభం..
- ●Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 680 పాయింట్లు పతనం..
- ●Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిరసనను విజయంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ●BEL | బీఈఎల్‌లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్లు.. నేటి నుంచి దరఖాస్తులు షురూ..
- ●Cyclone Arnab | తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాను.. పలు విమానాలు, రైళ్లు రద్దు
- ●Kolkata | బాలికకు ముద్దు పెట్టాడని తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించారు.. నిందితులను కూడా..

Jio Platforms IPO | జియో ఐపీవో ఇన్వెస్టర్లపై కనకవర్షం.. 21 శాతం లాభం..

Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 680 పాయింట్లు పతనం..

Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిరసనను విజయంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

BEL | బీఈఎల్‌లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్లు.. నేటి నుంచి దరఖాస్తులు షురూ..






