త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ను ఢీకొట్టిన స్కూట‌ర్.. ఇద్ద‌రు మృతి

Hyderabad | హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని హ‌ఫీజ్‌పేట్ - గ‌చ్చిబౌలి మార్గంలోని ఏఎంబీ ఫ్లై ఓవ‌ర్‌( AMB Flyover )పై శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. రాంగ్ రూట్‌లో వ‌చ్చిన స్కూట‌ర్( Scooter ).. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌( Royal Enfield Bike )ను ఢీకొట్టింది.

S

Hyderabad | Published On Jun 26, 2026, 10.47 am IST

Hyderabad | రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ను ఢీకొట్టిన స్కూట‌ర్.. ఇద్ద‌రు మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని హ‌ఫీజ్‌పేట్ - గ‌చ్చిబౌలి మార్గంలోని ఏఎంబీ ఫ్లై ఓవ‌ర్‌( AMB Flyover )పై శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్ర‌మాదం సంభ‌వించింది. రాంగ్ రూట్‌లో వ‌చ్చిన స్కూట‌ర్( Scooter ).. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌( Royal Enfield Bike )ను ఢీకొట్టింది.

 

దీంతో స్కూట‌ర్‌పై ప్ర‌యాణిస్తున్న శ్రీకాంత్, విఠ‌ల్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌పై వెళ్తున్న వినోద్‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. దీంతో అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రిలో చేర్పించారు. శ్రీకాంత్, విఠ‌ల్ మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement