త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Residents Die in Melbourne | మెల్‌బోర్న్‌లో రెండేళ్ల కుమారుడితో స‌హా హైదరాబాదీ మహిళ మృతి

Hyderabad Residents Die in Melbourne | హైదరాబాద్‌ (Hyderabad)లోని మలక్‌పేటకు చెందిన 32 ఏళ్ల రబియా బేగం (Rabiya begum), ఆమె రెండున్నరేళ్ల కుమారుడు అబ్దుల్లా అబ్బాస్ (Abdullah Abbas) ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌(Melbourne) లో మంగ‌ళ‌వారం ఓ కాలువలో మునిగి మృతి చెందారు.

S

Hyderabad | Published On Nov 18, 2026, 3.38 pm IST

Hyderabad Residents Die in Melbourne | మెల్‌బోర్న్‌లో రెండేళ్ల కుమారుడితో స‌హా హైదరాబాదీ మహిళ మృతి
Advertisement

Hyderabad Residents Die in Melbourne | త్రినేత్ర న్యూస్‌: హైదరాబాద్‌ (Hyderabad)లోని మలక్‌పేటకు చెందిన 32 ఏళ్ల రబియా బేగం (Rabiya begum), ఆమె రెండున్నరేళ్ల కుమారుడు అబ్దుల్లా అబ్బాస్ (Abdullah Abbas) ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌(Melbourne) లో మంగ‌ళ‌వారం ఓ కాలువలో మునిగి మృతి చెందారు. మెల్‌బోర్న్ ఉత్తర ప్రాంతంలోని క్రెయిగీబర్న్‌లో, ఐట్కెన్ బౌలేవార్డ్ సమీపంలోని మాల్కమ్ క్రీక్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులతో క‌లిసి గోల్డెన్ సన్ మాత్ పార్క్ సమీపంలో ర‌బియా బేగం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో రెండున్నరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ కాలువలోకి దిగాడు. నీటిలోకి వెళ్లిన కుమారుడిని రక్షించేందుకు తల్లి రబియా బేగం కూడా కాలువలోకి దిగారు. అయితే దురదృష్టవశాత్తూ తల్లీకొడుకులు ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. ర‌బియా భ‌ర్త‌, మూడేళ్ల కుమార్తె ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అత్యవసర సేవల సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

Advertisement
Advertisement