త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | శ్రీరామ న‌వ‌మి శోభాయాత్ర‌.. ఉద‌యం 9 నుంచి హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | శ్రీరామ‌న‌వ‌మి (Sriramanavami) వేడుకుల‌కు హైద‌రాబాద్ ముస్తాబైంది. న‌గ‌రంలోని రామాల‌యాలు, హ‌నుమాన్‌ ఆల‌యాల్లో న‌వమి వేడుక‌ల సంద‌డి నెల‌కొంది. వాడ‌వాడ‌నా రాముల‌వారి క‌ల్యాణం క‌మ‌నీయంగా జ‌రుగ‌నుంది.

G

Hyderabad | Published On Mar 27, 2026, 6.53 am IST

Traffic Restrictions | శ్రీరామ న‌వ‌మి శోభాయాత్ర‌.. ఉద‌యం 9 నుంచి హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్: శ్రీరామ‌న‌వ‌మి (Sriramanavami) వేడుకుల‌కు హైద‌రాబాద్ ముస్తాబైంది. న‌గ‌రంలోని రామాల‌యాలు, హ‌నుమాన్‌ ఆల‌యాల్లో న‌వమి వేడుక‌ల సంద‌డి నెల‌కొంది. వాడ‌వాడ‌నా రాముల‌వారి క‌ల్యాణం క‌మ‌నీయంగా జ‌రుగ‌నుంది. అనంత‌రం రామ‌య్య‌ను ఊరేగించ‌నున్నారు. ఇందులో భాగంగా ఓల్డ్ సిటీ నుంచి కోఠిలోని సుల్తాన్ బ‌జార్ హ‌నుమాన్ వ్యాయ‌మ‌శాల వ‌ర‌కు శ్రీరామ‌న‌వ‌మి శోభాయాత్రను (Sriramanavami Shobhayatra) పెద్దఎత్తున నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు శోభాయాత్ర జ‌రిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు. యాత్ర స‌మ‌యంలో ఈ మార్గంలో వాహ‌నాల‌కు అనుమ‌తించ‌రు. శుక్ర‌వారం ఉద‌యం 9 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు పేర్కొన్నారు. బేగం బ‌జార్‌, అఫ్జ‌ల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ ర‌ద్దీ అధికంగా ఉంటే అవ‌కాశం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో వాహ‌న‌దారులు ప్ర‌త్నామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని సూచించారు.

శోభాయాత్ర నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 3 వేల మంది పోలీసులు, డ్రోన్ల‌తో నిఘా పెంచారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • ఆసిఫ్ నగర్ నుంచి భోయిగూడ కమాన్ వైపు వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద విజయ్ నగర్ కాలనీ, నాంపల్లి, మెహదీపట్నం వైపు మళ్లించబడుతుంది.
  • అఘాపురా - భోయిగూడ కమాన్ బై-లేన్ల నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ భోయిగూడ కమాన్ వద్ద అఘాపురా - హబీబ్ నగర్ వైపు మళ్లిస్తారు.
  • దారుసలాం నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద ఘోడే-కీ-ఖబర్ లేదా కొత్త అఘాపురా, చార్‌కందిల్ ఎక్స్ రోడ్, నాంపల్లి వైపు మళ్లించబడుతుంది.
  • శోభాయాత్ర భోయిగూడ కమాన్ వద్ద మంగళ్‌హాట్ మార్కెట్ వైపు కుడి మలుపు తీసుకున్నప్పుడు, గాంధీ విగ్రహం నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ ఘోడే-కీ-ఖబర్ వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా కొత్త అఘాపురా వైపు మళ్లించబడుతుంది.
  • పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి మంగళ్‌హాట్ వైపు వచ్చే ట్రాఫిక్ గాంధీ విగ్రహం వద్ద టక్కర్‌వాడీ జంక్షన్ లేదా ఘోడే-కీ-ఖబర్ లేదా పురానాపూల్ వైపు మళ్లించబడుతుంది.
  • పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ పురానాపూల్ ఎక్స్ రోడ్స్ వద్ద పురానాపూల్ దర్వాజా, కర్వాన్, కుల్సుంపురా, 100 ఫీట్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది.

  • ఎంజే బ్రిడ్జ్ నుంచి టక్కర్‌వాడీ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ అఘాపురా, ఘోడే-కీ-ఖబర్ వైపు మళ్లించబడుతుంది. MJ బ్రిడ్జ్ నుంచి అఫ్జల్‌గంజ్ లేదా సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ రోడ్డు మీదుగా మళ్లించబడతాయి.
  • బేగంబజార్ ఛత్రీ నుంచి వచ్చే ట్రాఫిక్ రాణి అవంతి బాయి విగ్రహం వద్ద MJ బ్రిడ్జ్ వైపు మళ్లించబడుతుంది.
  • బేగంబజార్ బై-లేన్ల నుంచి గాంధీ విగ్రహం లేదా పురానాపూల్ వైపు వచ్చే ట్రాఫిక్ లేబర్ అడ్డా వద్ద అలాస్కా T-జంక్షన్ వైపు మళ్లించబడుతుంది.
  • మాలకుంట నుంచి MJ బ్రిడ్జ్ వైపు వెళ్లే ట్రాఫిక్ అలాస్కా T-జంక్షన్ వద్ద దారుసలాం లేదా మాలకుంట వైపు మళ్లించబడుతుంది. రంగచారి లేన్, అఫ్జల్‌గంజ్ నుంచి బేగంబజార్ వైపు వచ్చే ట్రాఫిక్ SA బజార్ (శ్రీకృష్ణ జ్యువెలరీ వద్ద) నుంచి MJ మార్కెట్ వైపు మళ్లించబడుతుంది.
  • అఫ్జల్‌గంజ్ బై-లేన్ల నుంచి SA బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ SA బజార్ U-టర్న్ వద్ద అఫ్జల్‌గంజ్సా లేదా లార్‌జంగ్ బ్రిడ్జ్ వైపు మళ్లించబడుతుంది.
  • అజంతా గేట్, జాంబాగ్‌ల నుంచి SA బజార్ వైపు వచ్చే ట్రాఫిక్ MJ మార్కెట్ వద్ద పుత్లీబౌలి, రంగమహల్ వైపు మళ్లించబడుతుంది.
  • నయాపూల్ నుంచి SA బజార్ మసీదు వైపు వచ్చే ట్రాఫిక్ అఫ్జల్‌గంజ్ T-జంక్షన్ వద్ద సెంట్రల్ లైబ్రరీ - శివాజీ బ్రిడ్జ్ - CBS వైపు మళ్లించబడుతుంది.
  • నాంపల్లి, అబిడ్స్ నుంచి SA బజార్ మసీదు వైపు వెళ్లే ట్రాఫిక్ MJ మార్కెట్ వద్ద జాంబాగ్, పుట్లిబౌలి, రంగమహల్ వైపు మళ్లించబడుతుంది.
  • అబిడ్స్ రోడ్డు నుంచి MJ మార్కెట్ వైపు వచ్చే ట్రాఫిక్ బ్యాంక్ స్ట్రీట్, ఆంధ్ర బ్యాంక్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది. (యాత్ర శంకర్ షేర్ హోటల్ చేరుకోగానే ఈ మళ్లింపు తొలగించబడుతుంది).
  • పుత్లిబౌలి నుంచి శంకర్ షేర్ హోటల్ వైపు వచ్చే ట్రాఫిక్ గౌలిగూడ చమన్ వద్ద త్రివేణి లాడ్జ్, CBS వైపు మళ్లించబడుతుంది.
  • రంగమహల్ నుంచి గౌలిగూడ చమన్ వైపు వచ్చే ట్రాఫిక్ పుట్లిబౌలి ఎక్స్ రోడ్స్ వద్ద జాంబాగ్, MJ మార్కెట్ వైపు మళ్లించబడుతుంది. ఆంధ్ర బ్యాంక్ నుండి వచ్చే ట్రాఫిక్ కూడా ఇదే విధంగా మళ్లించబడుతుంది.
  • చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి పుత్లిబౌలి, జాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్ రంగమహల్ Y-జంక్షన్ వద్ద CBS, అఫ్జల్‌గంజ్ వైపు మళ్లించబడుతుంది.
  • GPO-అబిడ్స్ నుంచి పుత్లిబౌలి ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వద్ద DMHS ఎక్స్ రోడ్ వైపు, అబిడ్స్ రోడ్డు నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే వాహనాలను GPO వద్ద MJ మార్కెట్ వైపు మళ్లిస్తారు.
  • MJ మార్కెట్ నుంచి ట్రూప్ బజార్/బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ యూసుఫ్ అండ్ కంపెనీ వద్ద GPO మరియు MJ మార్కెట్ వైపు మళ్లించబడుతుంది.
  • చాదర్‌ఘాట్ నుంచి ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ DMHS ఎక్స్ రోడ్ వద్ద సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడుతుంది. సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ చాదర్‌ఘాట్ వైపు మళ్లించబడుతుంది.
  • చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్ నుంచి DMHS ఎక్స్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ చాదర్‌ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద నింబోలిఅడ్డ – కాచిగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్లించబడుతుంది.
  • నారాయణగూడ నుంచి బడీచౌడి వైపు వచ్చే ట్రాఫిక్ కాచిగూడ ఎక్స్ రోడ్ వద్ద కాచిగూడ స్టేషన్ రోడ్డు వైపు మళ్లించబడుతుంది. అబిడ్స్ నుంచి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చే ట్రాఫిక్ GPO వద్ద MJ మార్కెట్ వైపు మళ్లించబడుతుంది.
  • బాటా రోడ్ – కింగ్ కోఠి – రాంకోఠి ఎక్స్ రోడ్ నుంచి ప్రగతి టిఫిన్ సెంటర్ వైపు వచ్చే ట్రాఫిక్ బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లించబడుతుంది.

రద్దీ ఉండే ప్రాంతాలు

  • బేగంబజార్ ఛత్రీ, SA బజార్, అఫ్జల్‌గంజ్ T-జంక్షన్, శివాజీ బ్రిడ్జ్, CBS, రంగమహల్ Y-జంక్షన్, పుత్లిబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్ర బ్యాంక్, అబిడ్స్ GPO, MJ మార్కెట్, చాదర్‌ఘాట్, కాచిగూడ ఎక్స్ రోడ్, నింబోలిఅడ్డ.

ట్రాఫిక్‌కు సంబంధించి మ‌రింత సమాచారం కోసం హైద‌రాబాద్ సిటీ పోలీస్‌ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వాల‌ని, అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కు కాల్ చేయవ‌చ్చ‌ని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement