త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | ఇళ‌యరాజా క‌చేరి.. నేడు గ‌చ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

Traffic Restrictions | గ‌చ్చిబౌలి ప‌రిధిలో శ‌నివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. గ‌చ్చిబౌలి స్టేడియంలో శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు మ్యూజిక‌ల్ మెస్ట్రో ఇళ‌య‌రాజా మ్యూజిక‌ల్ నైట్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు.

S

Hyderabad | Published On Mar 28, 2026, 8.09 am IST

Traffic Restrictions | ఇళ‌యరాజా క‌చేరి.. నేడు గ‌చ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్ : గ‌చ్చిబౌలి ప‌రిధిలో శ‌నివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. గ‌చ్చిబౌలి స్టేడియంలో శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు మ్యూజిక‌ల్ మెస్ట్రో ఇళ‌య‌రాజా మ్యూజిక‌ల్ నైట్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు ఇళ‌య‌రాజా క‌చేరి నేప‌థ్యంలో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు గ‌చ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. దీంతో వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

  • గ‌చ్చిబౌలి జంక్ష‌న్ నుంచి లింగంప‌ల్లి వైపు వెళ్లే వాహ‌న‌దారులు ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ మీదుగా విప్రో జంక్ష‌న్ రైట్ ట‌ర్న్, గౌలిదొడ్డి, గోప‌న్‌పల్లి జంక్ష‌న్, న‌ల్ల‌గండ్ల మీదుగా లింగంప‌ల్లి చేరుకోవ‌చ్చు.
  • గోప‌న్‌ప‌ల్లి తండా, గౌలిదొడ్డి, క్యూ సిటీ, కోకాపేట్ నుంచి వ‌చ్చే వాహ‌న‌దారులు ట్రిపుల్ ఐటీ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లింపు తీసుకుని విప్రో జంక్ష‌న్ మీదుగా నాన‌క్‌రాంగూడ‌, రోట‌రీ 2, లెఫ్ట్ ట‌ర్న్, ఓఆర్ఆర్ మీదుగా గ‌చ్చిబౌలికి చేరుకోవ‌చ్చు.
  • లింగంప‌ల్లి నుంచి గ‌చ్చిబౌలి జంక్ష‌న్ వైపు వెళ్లే వాహ‌న‌దారులు.. బ‌స్ డిపోట‌ల్ వ‌ద్ద మ‌ళ్లింపు తీసుకొని మ‌జీద్‌బండ‌, శ్రీరాంన‌గ‌ర్, బొటానిక‌ల్ జంక్ష‌న్ రైట్ ట‌ర్న్, ఉడుపి హోట‌ల్, జడ్‌పీహెచ్ఎస్ గ‌చ్చిబౌలి, గ‌చ్చిబౌలి జంక్ష‌న్ లెఫ్ట్ ట‌ర్న్ మీదుగా మెహిదీప‌ట్నం చేరుకోవ‌చ్చు.
Advertisement

తాజావార్తలు

Advertisement