త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hanuman Jayanti | ఎల్లుండే హ‌నుమాన్ జ‌యంతి.. హైద‌రాబాద్‌లో హైఅల‌ర్ట్..

Hanuman Jayanti | ఏప్రిల్ 2వ తేదీన హ‌నుమాన్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు హైద‌రాబాద్ న‌గ‌రం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో హ‌నుమాన్ శోభాయాత్ర‌ను పాత‌బ‌స్తీలోని గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బ‌న్ హనుమాన్ టెంపుల్ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

S

Hyderabad | Published On Mar 31, 2026, 4.33 pm IST

Hanuman Jayanti | ఎల్లుండే హ‌నుమాన్ జ‌యంతి.. హైద‌రాబాద్‌లో హైఅల‌ర్ట్..
Advertisement

Hanuman Jayanti | త్రినేత్ర‌.న్యూస్ : ఏప్రిల్ 2వ తేదీన హ‌నుమాన్ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు హైద‌రాబాద్ న‌గ‌రం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో హ‌నుమాన్ శోభాయాత్ర‌ను పాత‌బ‌స్తీలోని గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బ‌న్ హనుమాన్ టెంపుల్ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.

హ‌నుమాన్ శోభాయాత్ర నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వారం పోలీసుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను ప‌రిశీలించిన సీసీ.. ఆ మార్గంలో ప‌టిష్ట పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

శోభాయాత్ర కొన‌సాగే మార్గంలో సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ట్రాఫిక్ మ‌ళ్లింపులు చేప‌ట్టాల‌న్నారు. వాహ‌న‌దారులకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంపిక చేయాల‌న్నారు. పోలీసుల‌కు న‌గ‌ర ప్ర‌జ‌లు స‌హ‌క‌రించి, శోభాయాత్ర ప్ర‌శాంతంగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement