Hyderabad | హైదరాబాద్‌లో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. కుమార్తెతో కలిసి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో (Hyderabad) విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు.
శనివారం తెల్లవారుజామున బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున 2.30 గంటలకు రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను చూసిన గూడ్స్‌రైలు లోకోపైలట్ సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను పిన్నింటి విజయశాంతి, కుమార్తె చేతన రెడ్డిగా, కుమారుడు విశాల్‌గా గుర్తించారు. చేతన ఇంటర్ రెండో ఏడాది చదువుతుండగా, విశాల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలేదు. మృతదేహాలను గాంధీ దవాఖాన తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





