త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weekend Drunk and Drive | మ‌ద్యం తాగారు.. క‌ట‌క‌టాల‌పాల‌య్యారు

Weekend Drunk and Drive | సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వీకెండ్ స్పెష‌ల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డి ప‌లువురు క‌ట‌క‌టాల‌పాల‌య్యారు. ఈ డ్రైవ్‌లో 300 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసిన‌ట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP ట్రాఫిక్ I, జీ హన్మంతరావు తెలిపారు.

S

Hyderabad | Published On May 17, 2026, 5.45 pm IST

Weekend Drunk and Drive | మ‌ద్యం తాగారు.. క‌ట‌క‌టాల‌పాల‌య్యారు
Advertisement
  • సైబరాబాద్ లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్‌ డ్రైవ్ లో 300 మందిపై కేసులు

Weekend Drunk and Drive | త్రినేత్ర‌.న్యూస్‌: సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వీకెండ్ స్పెష‌ల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డి ప‌లువురు క‌ట‌క‌టాల‌పాల‌య్యారు. ఈ డ్రైవ్‌లో 300 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసిన‌ట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP ట్రాఫిక్ I, జీ హన్మంతరావు తెలిపారు. 253 ద్విచక్ర వాహనదారులు, 9 ఆటోలు, 38 కార్లు, హెవీ వాహనదారులపై కేసులు నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సన్ట్రేషన్ (బీఏసీ) ఆధారంగా 232 మంది 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్, 35 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్, 33 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ తీసుకొని పట్టుబడ్డారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపరిచాం అని హ‌న్మంత‌రావు పేర్కొన్నారు.

గత వారం మొత్తం 96 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో 7 మందికి జరిమానా, జైలు శిక్ష, 2 మందికి జరిమానా, సోషల్‌ సర్వీస్, 87 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత -2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ నేరానికి గరిష్ఠ‌ శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంద‌ని వివ‌రించారు.

Advertisement
Advertisement