MMTS | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్.. మళ్లీ తెరపైకి డిమాండ్
MMTS | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైల్ మార్గాన్ని అనుసంధానించడం మంచి విషయమే. కానీ ఎంఎంటీఎస్‌ను కూడా ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లాలని మళ్లీ తెరపైకి డిమాండ్ వచ్చింది.
MMTS | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైల్ మార్గాన్ని అనుసంధానించడం మంచి విషయమే. కానీ ఎంఎంటీఎస్‌ను కూడా ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లాలని మళ్లీ తెరపైకి డిమాండ్ వచ్చింది. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 6 కిలోమీటర్ల మేర భూమిని కేటాయించాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అటు జీఎంఆర్‌ను ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ రైలు మార్గానికి భూమిని కేటాయిస్తే కేవలం ఆరు నెలల కాలంలోనే పనులు పూర్తై రైలు మార్గం అందుబాటులోకి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలోని ఏ మూలనుంచైనా.. ఎయిర్‌పోర్టుకు రూ. 5 నుంచి రూ. 30 ఛార్జీతో సులభంగా చేరుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేదా ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వీటికి భారీగా రుసుం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అనుసంధానిస్తే ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
2014లో ప్రతిపాదన
2014లో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభమైంది. నాడు విమాన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించాలని నిర్ణయించినప్పటికీ.. జీఎంఆర్ నిర్వాహకులు అనుమతించకపోవడంతో ఉందానగర్ వరకే పరిమితమైంది. దీంతో ఎయిర్‌పోర్టుకు 6 కిలోమీటర్ల దూరంలోనే ఎంఎంటీఎస్ ఆగిపోయింది.
ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే..
భవిష్యత్తులో భూముల అవసరం ఉంటుందని, రైల్వే స్టేషన్ నిర్మిస్తే సమస్యలు వస్తాయని జీఎంఆర్ సంస్థ వాదించడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాడు పేర్కొన్నారు. ముఖ్యంగా.. భూసేకరణ, ఇతర అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పనుల్లో పురోగతి కనిపించలేదు. భవిష్యత్తులో ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ ప్రజలకు ఒక సురక్షితమైన, చవకైన, సులభమైన ప్రయాణ మార్గం అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





