Water Supply | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్( Hyderabad ) మహా నగర ప్రజలకు ముఖ్య గమనిక. 36 గంటల పాటు తాగునీటి సరఫరా( Water Supply )ను బంద్ చేయనున్నట్లు జల మండలి( Jala Mandali ) అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 27వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంటే 36 గంటల పాటు తాగునీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పైపు లైన్ల పునరుద్ధరణ పనుల కారణంగానే తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నీటి సరఫరా బంద్ ఈ ప్రాంతాల్లోనే.. మీరాలం, కిషన్ బాగ్, బాల్‌శెట్టి ఖేట్, మొఘల్‌పురా, ఫలక్‌నూమా, బహదూర్‌పురా, జహనుమా, మహబూబ్ మాన్సన్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, బొగ్గులకుంట, నారాయణగూడ, అడిక్‌మెట్ రిజర్వాయర్, శివమ్ రిజర్వాయర్, చిలకలగూడ రిజర్వాయర్, అలియాబాద్ రిజర్వాయర్, రియాసత్ నగర్ రిజర్వాయర్‌తో పాటు దిల్‌సుఖ్‌నగర్, హర్డ్‌వేర్ పార్కు, జల్‌పల్లి, తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ, మన్నెగూడ ఏరియాల్లో కూడా నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు గురువారం జలమండలి బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కృష్ణా ఫేజ్ 1కు సంబంధించి 700 ఎంఎం డయా మీటర్ ఎంఎస్ పైపులైన్‌లో లీకేజీ సమస్య ఉన్నట్లు గుర్తించామని, వాటి మరమ్మతుల నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో నగర ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.