Foreign Travel | విదేశీ టూర్లకు బ్రేక్.. ఇండియన్స్ ఖర్చు భారీగా తగ్గింపు..
Foreign Travel | భారతీయులు విదేశీ ప్రయాణాలపై ఖర్చును ఒక్కసారిగా తగ్గించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మార్చిలో విదేశీ టూర్ల కోసం పంపిన డబ్బు ఫిబ్రవరితో పోలిస్తే 212 మిలియన్ డాలర్లకు పైగా తగ్గింది.
Foreign Travel | భారతీయులు విదేశీ ప్రయాణాలపై ఖర్చును ఒక్కసారిగా తగ్గించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, మార్చిలో విదేశీ టూర్ల కోసం పంపిన డబ్బు ఫిబ్రవరితో పోలిస్తే 212 మిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం, రూపాయి విలువపై ఒత్తిడి కొనసాగడం వంటి పరిస్థితుల్లో ఈ తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ (LRS) కింద విదేశాలకు పంపే మొత్తాల్లో ట్రావెల్ ఖర్చులే ఇప్పటికీ అతిపెద్ద భాగంగా కొనసాగుతున్నాయి. మార్చిలో ట్రావెల్ సంబంధిత రిమిటెన్స్ 1.09 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇది ఫిబ్రవరిలో 1.3 బిలియన్ డాలర్లు కాగా, జనవరిలో 1.65 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో పశ్చిమ ఆసియా ఘర్షణల ప్రభావంతో చమురు ధరలు పెరిగి, రూపాయి రికార్డు స్థాయి కనిష్ఠాలకు చేరింది. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ ప్రజలను విదేశీ ప్రయాణాలను తగ్గించాలని, కార్‌పూలింగ్ వంటి చర్యలు పాటించాలని సూచించారు. విదేశీ ప్రయాణ ఖర్చులు తగ్గితే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గి, రూపాయి స్థిరీకరణకు సహాయపడుతుందని చెప్పారు.
ట్రావెల్ విభాగామే అతి పెద్ద వాటా..
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, మార్చిలో ఎల్‌ఆర్‌ఎస్ కింద మొత్తం విదేశీ రిమిటెన్స్ 2.59 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ట్రావెల్ విభాగమే అతిపెద్ద వాటాను దక్కించుకుంది. ఆర్‌బీఐ విదేశీ ఖర్చులను ట్రావెల్, విదేశీ విద్య, బంధువుల నిర్వహణ, విదేశీ పెట్టుబడులు, ప్రాపర్టీ కొనుగోళ్లు వంటి విభాగాల వారీగా ట్రాక్ చేస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం భారతీయులు, మైనర్లతో సహా, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపించవచ్చు. ట్రావెల్ విభాగంలో అదర్ ట్రావెల్ కేటగిరీ అతిపెద్ద భాగంగా నిలిచింది. ఇందులో హాలిడే ఖర్చులు, అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ సెటిల్‌మెంట్లు ఉంటాయి. మార్చిలో ఈ కేటగిరీ కింద భారతీయులు 623.05 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇది మొత్తం ట్రావెల్ రిమిటెన్స్‌లో దాదాపు 57 శాతం కావడం గమనార్హం.
విభాగాల వారిగా వివరాలు..
విద్యా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు, హాస్టల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులతో కలిపి 450.16 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వ్యాపార ప్రయాణాలు, యాత్రలు, విదేశీ వైద్య చికిత్సల ఖర్చులు కలిపి 21.39 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న సన్నిహిత బంధువుల నిర్వహణ కోసం పంపే డబ్బు మాత్రం పెరిగింది. ఫిబ్రవరిలో 266.18 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ విభాగం మార్చిలో 389.78 మిలియన్ డాలర్లకు చేరింది. ఇక స్టడీస్ అబ్రాడ్ కేటగిరీలో ఖర్చులు తగ్గాయి. విదేశాలకు వెళ్లకుండా ఆన్‌లైన్ లేదా కరస్పాండెన్స్ కోర్సుల కోసం చెల్లించే ఫీజులు ఇందులో ఉంటాయి. ఈ విభాగంలో మార్చిలో 151.71 మిలియన్ డాలర్లు పంపించగా, ఫిబ్రవరిలో ఇది 175.68 మిలియన్ డాలర్లు, జనవరిలో 267.42 మిలియన్ డాలర్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు ఎల్‌ఆర్‌ఎస్ కింద మొత్తం 29.56 బిలియన్ డాలర్లు విదేశాలకు పంపించారు. ఇందులో ట్రావెల్ ఖర్చులే 16.96 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాయి.
ఈక్విటీల్లో పెరిగిన పెట్టుబడులు..
అలాగే విదేశీ ఈక్విటీ, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో భారతీయుల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరిలో 265.99 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పెట్టుబడులు మార్చిలో 440.22 మిలియన్ డాలర్లకు పెరిగాయి. మరోవైపు విదేశాల్లో స్థిరాస్తుల కొనుగోలుకు పంపిన డబ్బు తగ్గింది. ఫిబ్రవరిలో 51.36 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ ఖర్చు మార్చిలో 38.68 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
తాజావార్తలు
- ●Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత
- ●Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..
- ●Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు
- ●POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష
- ●Central Railway Stations | ప్రయాణికులకు అలర్ట్.. పెరగనున్న ఇడ్లీ, దోశ, సమోస, వడ పావ్ ధరలు
- ●Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమన్

Rs 1,000 crore cocaine seized | కచ్ తీరంలో రూ.1000 కోట్ల డ్రగ్స్ పట్టివేత

Samsung | ఏఐ బూమ్‌తో శాంసంగ్ చిప్ డివిజన్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల మేర బోనస్..

Balka Suman | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై కేసు నమోదు

POCSO Case | పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏండ్ల కఠిన జైలు శిక్ష




