త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Common Travel Pass | మెట్రో, ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి ఉమ్మ‌డి పాస్

Common Travel Pass | మెట్రో (Hyderabad Metro), ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండిటికీ క‌లిపీ ఉమ్మ‌డి పాస్‌ల‌ను (Common Travel Pass) ప్ర‌వేశ‌పెట్టింది.

G

Hyderabad | Published On Oct 2, 2026, 8.13 am IST

Common Travel Pass | మెట్రో, ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి ఉమ్మ‌డి పాస్
Advertisement

Common Travel Pass | త్రినేత్ర‌.న్యూస్‌: మెట్రో (Hyderabad Metro), ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండిటికీ క‌లిపీ ఉమ్మ‌డి పాస్‌ల‌ను (Common Travel Pass) ప్ర‌వేశ‌పెట్టింది. రోజువారీ ఉమ్మ‌డి పాస్ ధ‌ర‌ రూ.400, నెల‌వారీ పాస్ ధ‌ర రూ.8500గా నిర్ణ‌యించింది. వీటిద్వారా మెట్రోతోపాటు ఔట‌ర్ రింగ్‌రోడ్డు (ORR) వ‌ర‌కు పుష్ప‌క్ మిన‌హా అన్ని ర‌కాల‌ ఆర్టీసీ స‌ర్వీసుల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చు. అదేవిధంగా సిటీ బ‌స్సుల్లో ప్రయాణికులకు చిల్లర, టికెట్ల ఇబ్బందులు లేకుండా మీ టికెట్‌యాప్‌ ద్వారా ఓపెన్‌ టికెటింగ్‌ విధానాన్ని తీసుకొస్తున్న‌ది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శుక్ర‌వారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభవన్‌లో ప్రారంభించ‌నున్నారు.

మీ టికెట్ యాప్‌..

సిటీ బస్సుల్లో (TGSRTC) ప్రయాణించే ప్యాసింజర్లకు కాగితపు టికెట్ల ఇబ్బందులు తప్పించేందుకు `మీ టికెట్‌` (MeeTicket) యాప్ ద్వారా ప్రయాణికులే నేరుగా టికెట్‌ బుక్‌ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. న‌గ‌దు చెల్లింపు పూర్తయిన వెంటనే యాప్‌లో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ టికెట్‌ (Dynamic QR Code) జనరేట్‌ అవుతుంది. ప్రయాణ సమయంలో దీనిని బస్సులో చూపిస్తే సరిపోతుంది.

అదేవిధంగా డిజిటల్‌ వీక్లీ బస్‌పాస్ సౌక‌ర్యాన్ని కూడా ప్ర‌వేశ‌పెట్టింది. రూ.600 చెల్లించి వారంరోజుల పాటు అన్ని బ‌స్సుల్లో అప‌రిమిత ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. రోజువారీ, నెల‌వారీ పాసులు కూడా మీ టికెట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. దీనిద్వారా బస్‌ పాస్‌ సెంటర్లకు వెళ్లే అవసరం లేకుండా నేరుగా యాప్ నుంచే బ‌స్ పాస్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఆర్టీసీ, మెట్రోకు కలిపి ఇస్తున్న పాస్‌ను అన్ని మెట్రో స్టేషన్లలో జారీచేస్తారు. ఒకే పాస్‌తో ఓఆర్‌ఆర్‌ లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సుల్లో (పుష్పక్‌ మినహా), మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. మొదటిసారి కొనుగోలు చేసేటప్పుడు కార్డుకు రూ.100 వసూలు చేస్తారు. కార్డును తిరిగి ఇచ్చేటప్పుడు రూ.100 వాపస్‌ చేస్తారు.

ఉమ్మడి పాస్‌ అమలు ఇలా..

రోజువారీ ఉమ్మ‌డి పాస్‌- రూ.400 (మెట్రో చార్జీ రూ.300, ఆర్టీసీ చార్జి రూ.100)
నెలవారీ పాస్‌- రూ.8,500 (మెట్రో చార్జీ రూ.7000, ఆర్టీసీ చార్జి రూ.1,500)

Advertisement

తాజావార్తలు

Advertisement