ECIL | ఈసీఐఎల్‌లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు.. తెలంగాణకు చెందినవారే అర్హులు
ECIL | హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నది. మొత్తం 310 ఖాళీలతో నోటిఫికేషన్ (Apprentice Recruitment) విడుదల చేసింది.
ECIL | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నది. మొత్తం 310 ఖాళీలతో నోటిఫికేషన్ (Apprentice Recruitment) విడుదల చేసింది. ఏడాది కాలవ్యవధి కలిగిన ఈ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి కలిగినవారు అక్టోబర్ 11లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ చేసిన తెలంగాణకు (Telangana) చెందిన వారుమాత్రమే అర్హులు. ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు- 310
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (EM): 86 (జనరల్ 35, ఈడబ్లూఎస్ 8, ఓబీసీ 23, ఎస్సీ 14, ఎస్టీ 6)
- ఫిట్టర్: 87 (జనరల్ 36, ఈడబ్లూఎస్ 9, ఓబీసీ 23, ఎస్సీ 13, ఎస్టీ 6)
- కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్: 41 (జనరల్ 17, ఈడబ్లూఎస్ 4, ఓబీసీ 11, ఎస్సీ 6, ఎస్టీ 3)
- మెకానిక్ (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్): 5 (జనరల్ 1, ఈడబ్లూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1)
- టర్నర్: 8 (జనరల్ 3, ఈడబ్లూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1)
- వెల్డర్: 16 (జనరల్ 7, ఈడబ్లూఎస్ 2, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1)
- మెషినిస్ట్: 7 (జనరల్ 2, ఈడబ్లూఎస్ 1, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1)
- మెషినిస్ట్ (G): 2 (జనరల్ 1, ఓబీసీ 1)
- పెయింటర్: 2 (జనరల్ 1, ఓబీసీ 1)
- ఎలక్ట్రీషియన్: 50 (జనరల్ 19, ఈడబ్లూఎస్ 5, ఓబీసీ 13, ఎస్సీ 9, ఎస్టీ 4)
- కార్పెంటర్: 2 (జనరల్ 1, ఓబీసీ 1)
- ప్లంబర్: 2 (జనరల్ 1, ఓబీసీ 1)
- డీజిల్ మెకానిక్: 2 (జనరల్ 1, ఓబీసీ 1)
అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. తెలంగాణ జిల్లాలలో నివసిస్తున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ, లేదా ప్రైవేట్ సంస్థలో అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 కింద ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన లేదా ప్రస్తుతం అప్రెంటిస్‌షిప్ చేస్తున్న వారు అర్హులు కారు. అభ్యర్థులు 2026 అక్టోబర్ 31 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
శిక్షణ కాలం: ఏడాది
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడంటే..
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. ముందుగా ఎంఎస్‌డీఈ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకొవాలి. ఆ తర్వాత ఈసీఐఎల్ వెబ్‌సైట్‌లో దరఖాస్తును సమర్పించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11
ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబర్ 22 నుంచి 24 వరకు
అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ జారీ: అక్టోబర్ 28 నుంచి 29 వరకు
అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: 2026 నవంబర్ 2
వెబ్‌సైట్: www.ecil.co.in
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

Telangana Cabinet Decisions October 1 | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 డీఏల మంజూరు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
అక్టోబర్ 1, 2026

Kalady Sri Adi Shankaracharya Math | అద్వైత సంగమం కార్యక్రమానికి రండి
అక్టోబర్ 1, 2026

Chamala Kirankumar Reddy | అమెరికాలో 30 ఏండ్లుగా ఉంటున్నోళ్లే హోటల్ పెట్టలేకపోయారు.. కేటీఆర్ ఆరేండ్లే ఉండి 3 స్టార్ హోటల్స్ కొన్నారా?
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 2 రాశిఫలాలు.. ఈ రాశి వారు కొత్త కోణాలను అన్వేషిస్తారు!
- ●Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక
- ●Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్
- ●Chinese Manja Ban Hyderabad | చైనా మాంజా అమ్మితే కటకటాలకే: వ్యాపారులకు హైదరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక.. అడ్వాన్సులు ఇస్తే అంతే సంగతులు
- ●Telangana Cabinet Decisions October 1 | ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 డీఏల మంజూరు: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
- ●Telangana CEO Form 6 Declaration | ఓటర్లకు సీఈవో కీలక ఆదేశాలు: ఆ ఒక్కటి లేకుంటే ఓటు కట్

Horoscope | అక్టోబర్ 2 రాశిఫలాలు.. ఈ రాశి వారు కొత్త కోణాలను అన్వేషిస్తారు!

Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక

Special Gram Sabha October 2 | అక్టోబర్ 2న ప్రత్యేక గ్రామసభలు: రైతులకు నిధుల పెంపు.. కరవు రహిత భారత్‌కు పక్కా రోడ్‌మ్యాప్

Chinese Manja Ban Hyderabad | చైనా మాంజా అమ్మితే కటకటాలకే: వ్యాపారులకు హైదరాబాద్ పోలీసుల తీవ్ర హెచ్చరిక.. అడ్వాన్సులు ఇస్తే అంతే సంగతులు



