త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక

కేబినెట్ భేటీకి ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ హాజరు కావొచ్చా? సీఎం విచక్షణాధికారాలు, నియామక ఉత్తర్వుల్లోని అసలు నిబంధనలు ఇవే.

J

Telangana | Published On Oct 1, 2026, 11.56 pm IST

Telangana Cabinet Meeting Rules | కేబినెట్ మీటింగ్‌కు ఎవరు రావొచ్చు? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి? నియామక ఉత్తర్వుల్లో కీలక మెలిక
Advertisement
  • మంత్రివర్గ సమావేశాలకు మంత్రులు కాకుండా ఇతరులు హాజరు కావాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి
  • ఈ అంశం కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించే ముఖ్యమంత్రి విచక్షణాధికారం (Discretionary Powers) పై ఆధారపడి ఉంటుంది
  • నియామక ఉత్తర్వుల్లో (G.O) కేబినెట్ సమావేశాలకు హాజరయ్యే వెసులుబాటు స్పష్టంగా పేర్కొంటేనే ప్రవేశం సాధ్యం
  • గతంలో కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి, వినోద్ కుమార్‌లకు ఈ అవకాశం ఇవ్వగా, ప్రస్తుత ప్రభుత్వంలో చిన్నారెడ్డికి మాత్రమే ఆ వెసులుబాటు

Telangana Cabinet Meeting Rules | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశాలకు సంబంధించి ప్రోటోకాల్, నిబంధనలపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా కేబినెట్ ర్యాంకు పదవి ఉన్న ప్రతి ఒక్కరూ మంత్రివర్గ సమావేశాలకు హాజరు కావచ్చనేది సంప్రదాయం కాదు. దీనికి నిర్దిష్టమైన నిబంధనలు, అధికారిక అనుమతులు తప్పనిసరి.

అనుమతి ఉంటేనే ఎంట్రీ

కేబినెట్ సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. మంత్రులు కాని ఇతర పదవుల్లోని వ్యక్తులు ఈ సమావేశాలకు హాజరు కావాలంటే ముందుగానే అనుమతి ఉండాలి. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వారికి ఆటోమేటిక్‌‌గా ఈ అవకాశం రాదు. వారి నియామక ఆర్డర్స్ (GO) జారీ చేసే సమయంలోనే "కేబినెట్ సమావేశాలకు హాజరయ్యే అర్హత" కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్డర్స్‌లో ఆ పాయింట్ లేకపోతే, సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండదు.

సీఎం విచక్షణాధికారం ప్రత్యేకం

ఎవరిని కేబినెట్ చర్చల్లోకి అనుమతించాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారం (Discretionary Power) పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డికి మాత్రమే ఆ వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మరోవైపు గద్వాల విజయలక్ష్మి నియామక ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొనకపోవడం వల్లే ఆమెకు ఆ అవకాశం దక్కలేదని సమాచారం.

గత ప్రభుత్వాల్లో అమలైన విధానం ఇదే

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇదే నిబంధన పక్కాగా అమలైంది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేసిన ఎస్. నిరంజన్ రెడ్డి, బి. వినోద్ కుమార్‌లకు మంత్రివర్గ సమావేశాలకు హాజరయ్యేలా అప్పట్లో ఉత్తర్వుల్లోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారు నిరభ్యంతరంగా భేటీల్లో పాల్గొనేవారు.

కేవలం కేబినెట్ హోదా ఉండటం మాత్రమే కాకుండా, ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ఉత్తర్వుల్లో సంబంధిత క్లాజ్ ఉన్నప్పుడే మంత్రివర్గ భేటీలోకి ఎంట్రీ సాధ్యమవుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement