త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR Birthday 2026 | తెలంగాణ రూపురేఖలు మార్చిన నాయకుడు కేసీఆర్.. 17న ఊరూరా పండుగలా జన్మదిన వేడుకలు: తలసాని

ఫిబ్రవరి 17న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సాధించిన ఓట్ల శాతంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

J

Hyderabad | Published On Feb 15, 2026, 8.30 pm IST

KCR Birthday 2026 | తెలంగాణ రూపురేఖలు మార్చిన నాయకుడు కేసీఆర్.. 17న ఊరూరా పండుగలా జన్మదిన వేడుకలు: తలసాని
Advertisement
  • ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదిన వేడుకలకు బీఆర్‌ఎస్ పిలుపు
  • తెలంగాణ భవన్‌లో కేటీఆర్ చేతుల మీదుగా కేక్ కటింగ్
  • నీళ్లు, కరెంట్, పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్న తలసాని
  • మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 10 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చాయని వెల్లడి
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని వ్యాఖ్య

KCR Birthday 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈ నెల 17న (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు.

గోస తీర్చిన నాయకుడు

"నీళ్లు లేని గోస, కరెంట్ లేని కష్టాలను తీర్చిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఒక ఆడబిడ్డ పెళ్లికి కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇచ్చి మేనమామలా ఆదుకున్నారు. గర్భిణీలకు కేసీఆర్ కిట్, రైతులకు రైతు బంధు, వృద్ధులకు ఆసరా పెన్షన్లు (రూ.200 నుంచి రూ.2016 పెంపు) అందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు." అని తలసాని కొనియాడారు. విద్యార్థుల కోసం గురుకులాలు, విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చిన దార్శనికుడు కేసీఆర్ అని అన్నారు.

తెలంగాణ భవన్‌లో సంబరాలు

కేసీఆర్ పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చీలల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. ఇక రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. అనంతరం అందరికీ భోజన ఏర్పాట్లు ఉంటాయని వెల్లడించారు.

మున్సిపల్ ఫలితాలపై విశ్లేషణ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తలసాని స్పందించారు. "అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల ఓట్లు వస్తే.. ప్రతిపక్షంలో ఉన్న మాకు 10.80 లక్షల ఓట్లు వచ్చాయి. ఇది సామాన్య విషయం కాదు. మా హయాంలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే వన్ సైడ్ ఉండేవి. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు చూపిన పోరాట పటిమ అద్భుతం," అని తలసాని ప్రశంసించారు. ఈ సమావేశంలో పల్లె రవికుమార్, కిషోర్ గౌడ్, ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.

https://x.com/BRSparty/status/2022983139350737087

 

Advertisement
Advertisement